టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ తమన్నా హవా దశాబ్దంన్నర నుండి కొనసాగుతూనే ఉంది. 30 సంవత్సరాల వయసు కలిగిన ఈ ముద్దుగుమ్మ 15 సంవత్సరాల వయసులో హీరోయిన్ ఛాన్సులు అందుకుని 20 ఏళ్ల వయసులో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక స్టేటస్ తెచ్చుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితి లో ఉన్నట్లు సరైన అవకాశాలు కూడా రానట్లు ఇండస్ట్రీలో వార్తలు మొన్నటి వరకు వచ్చాయి. గోపీచంద్ హీరోగా ‘సీటీమార్’ సినిమాలో తప్ప మరో ప్రాజెక్ట్ తమన్నా చేతిలో లేదు.

IHG

ఇలాంటి తరుణంలో తమన్నాకు అల్లు వారి 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫామ్  కోసం రూపొందుతున్న ఓ టాక్ షో కు హోస్ట్‌గా సెలక్ట్ అయినట్లు సమాచారం. త్వరలోనే ఈ టాక్ షో స్టార్ట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ షో కోసం ప్రతి ఎపిసోడ్ కి తమన్నా ఎనిమిది లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.

IHG's persona and Vijay's dancing skills ...

దీంతో ఈ వార్తలు విని సరైన అవకాశాలు లేకపోయినా కానీ తమన్నా తీసుకుంటున్న రెమ్యునరేషన్ విని చాలా మంది నెటిజన్లు వామ్మో అంటున్నారు. తమన్నా కి  సిల్వర్ స్క్రీన్ పై కాకపోయినా బుల్లితెర పైన బాగానే డిమాండ్ ఉందని కామెంట్ చేస్తున్నారు. మామూలుగా ఓ సినిమాకి తమన్నా రెమ్యునరేషన్ కోటి నుండి కోటిన్నర మధ్య ఉంటుందని సమాచారం. కానీ ఓ టాక్ షో కు అదికూడా ఫాంలో లేని టైంలో తమన్నా కి ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ రావటంతో ఇండస్ట్రీలో ఈ న్యూస్ పెద్ద హాట్ టాపిక్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: