ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో ఏడేళ్ళ వయస్సు కలిగిన జయ ప్రియ అనే చిన్నారిని దారుణంగా ప్రాణాలు తీయడం జరిగింది. తమిళనాడు రాష్ట్రం పుదుక్కొట్టై జిల్లా లో రెండో తరగతి చదువుతున్న జయ ప్రియ అనే చిన్నారి బుధవారం సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లి అదృశ్యమైంది. దీంతో తల్లిదండ్రులు ఇంటి చుట్టు పక్కల ఎంత వెతికినా కనపడక పోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తరువాత ఆ చిన్నారి గ్రామ పొలిమేరలో ముళ్లపొదల్లో విగతజీవిగా పోలీసులకు దొరికింది. దారుణంగా కామాంధులు అత్యాచారం చేసి అనంతరం హత్యకు పాల్పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో దక్షిణాదిలో జస్టిస్ ఫర్ జయప్రియ  అంటూ చాలామంది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రభుత్వం దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

కాగా తాజాగా ఈ ఘటనపై సాయిపల్లవి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తమిళనాడు కోయంబత్తూరు కి చెందిన సాయిపల్లవి తాను తమిళ అమ్మాయి అని చెప్పుకోవడానికి ఎప్పుడూ గర్వపడతాను అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలో తెలిపింది. ఇలాంటి తరుణంలో తమిళనాడు రాష్ట్రంలో ఏడు సంవత్సరాల చిన్నారి ని అత్యంత దారుణంగా చంపడాన్ని సాయి పల్లవి తీవ్ర స్థాయిలో ఖండించింది.

 

అలాంటి మనుషులు ఉండబట్టే ఇలాంటి దారుణమైన పరిస్థితి ప్రపంచంలో ఉందని చెప్పు కోచ్చింది. ఇలాంటి ప్రపంచంలో మరో బిడ్డకు జన్మనివ్వడానికి ఈ ప్రపంచానికి అర్హత లేదు అంటూ సోషల్ మీడియాలో సాయి పల్లవి తన ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఈ పోస్టు చూసిన చాలా మంది నెటిజన్లు, అభిమానులు సాయిపల్లవి కోపం రావడంలో తప్పు లేదు అన్ని సపోర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో... జరిగిన ఈ ఘటనపై చాలామంది నెటిజన్లు దోషులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: