నందమూరి వంశం నుండి వచ్చిన మూడవ తరం వారసుల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. నందమూరి హరికృష్ణ రెండవ తనయుడైన కళ్యాణ్ రామ్, మొదటి సినిమా తొలిచూపులోనే సినిమాతో హీరోగా అడుగుపెట్టారు. వాస్తవానికి అంతకముందు బాలకృష్ణ హీరోగా వచ్చిన బాలగోపాలుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేసిన కళ్యాణ్ రామ్, హీరోగా నటించిన మొదటి రెండు సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి, అనంతరం మూడవ సినిమా అతనొక్కడే తో సూపర్ హిట్ కొట్టి తన సత్తాని నిరూపించుకున్నారు. 

IHG

తొలిసారిగా ఆ సినిమా ద్వారా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థను స్థాపించిన కళ్యాణ్ రామ్, ఈ సినిమా ద్వారా యువ దర్శకుడు సురేందర్ రెడ్డి ని దర్శకుడిగా పరిచయం చేయడం జరిగింది. సింధు తులాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించగా రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫిని అందించారు. మంచి యాక్షన్ బేస్డ్ లవ్ స్టోరీ తో పాటు ఆకట్టుకునే కథ, కథనాలు ఈ సినిమాకు ప్రధాన హైలైట్. మణిశర్మ అందించిన సాంగ్స్ తో పాటు సురేందర్ రెడ్డి స్క్రీన్ ప్లే, ఎమోషన్స్, యాక్షన్ సీన్స్, ఫైట్స్ వంటివి ఈ సినిమాకు ప్రధాన హైలైట్ అని చెప్పాలి. 

 

చిన్నతనంలో కొన్ని అనుకోని ఘటనల వలన విడిపోయిన బావ మరదళ్ళు చివరికి ఒకరిని మరొకరు ఏవిధంగా పలు ఘటనల అనంతరం కలుసుకున్నారు అనే థీమ్ తో సాగే ఈ మూవీ లో హీరో కళ్యాణ్ రామ్ తో పాటు హీరోయిన్ సింధు తులాని కూడా ఎంతో బాగా నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ సినిమా తరువాత ఆమెకు నటిగా మంచి అవకాశాలు వచ్చాయి. ఒకరకంగా ఈ అతనొక్కడే సినిమా నందమూరి కళ్యాణ్ రామ్ మూవీ కెరీర్ ని మలుపుత్రిప్పిన సినిమాగా చెప్పవచ్చు. ఇక దీని తరువాత సురేందర్ రెడ్డి కి కూడా మంచి అవకాశాలు దక్కాయి.......!!

మరింత సమాచారం తెలుసుకోండి: