టాలీవుడ్ దిగ్గజ నటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ నట వారసులుగా ముందుగా హరికృష్ణ, బాలకృష్ణ సినిమా రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కాగా వారిలో ముందుగా శ్రీకృష్ణావతారం సినిమాలో బాలకృష్ణుడుగా హరికృష్ణ వెండితెర ప్రవేశం చేయగా, ఆ తరువాత తాతమ్మకల సినిమా ద్వారా బాలకృష్ణ ప్రవేశించడం జరిగింది. ఆ విధంగా తండ్రి వారసత్వంతో సినిమా రంగప్రవేశం చేసిన వారిద్దరిలో హరికృష్ణ, ఆ తరువాత నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడగా, బాలకృష్ణ మాత్రం హీరోగా మెల్లగా ఒక్కో సినిమా అవకాశంతో తన ఆకట్టుకునే అందం, నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుని ముందుకు సాగారు. 

IHG

మొదటి నుండి కూడా తండ్రికి తగ్గ తనయులుగా తమ తమ రంగాల్లో ముందుకు సాగిన ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎప్పడూ కూడా ఎంతో కలిసిమెలిసి ప్రేమానురాగాలతో ఉండేవారని పలువురు సినీ ప్రముఖులు చెప్తూ ఉంటారు. ఎంత మేమిద్దరం ఆయన తనయులం అయినప్పటికి కూడా సినిమాల విషయమై తండ్రి ఎన్టీఆర్ మాత్రం తమకు గురువు అని వారిద్దరూ అంటుంటారు. బాలకృష్ణ హీరోగా కొనసాగుతున్న సమయంలో హరికృష్ణ, తండ్రి ఎన్టీఆర్ వెంట నడిచి అప్పటి రాజకీయాల్లో ఆయనకు చేదోడు వాదోడుగా నిలవడం జరిగింది. అలానే అప్పటి ఎన్నికల్లో పోటీ చేసి రవాణా శాఖా మంత్రిగా కూడా టిడిపి పార్టీ తరపున పని చేసారు. ఆ విధంగా అటు హరికృష్ణ రాజకీయాల్లో, ఇటు బాలకృష్ణ సినిమా రంగంలో తండ్రి పేరు నిలబెట్టారు. 

 

ఇకపోతే మధ్యలో అక్కడక్కడా కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించిన హరికృష్ణ, ఆపై సీతయ్య, టైగర్ హరిశ్చంద్రప్రసాద్ వంటి సినిమాల్లో హీరోగా నటించారు. కాగా ఇటీవల హఠాత్తుగా కారు ప్రమాదంలో హరికృష్ణ హఠాన్మరణంతో బాలకృష్ణ కొంత మానసికంగా కృంగిపోయారు. తనకు అన్ని విధాలా ఎంతో ధైర్యాన్ని ఇచ్చే తన అన్న ప్రస్తుతం తమతో లేకపోవడం నిజంగా తమ దురదృష్టం అని, తమ అన్నదమ్ములం, అక్కచెల్లెళ్ళం అందరం కలిసిన సమయంలో అన్నయ్య లేని లోటు స్పష్టంగా కనపడుతుందని, ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా బాలకృష్ణ కొంత ఆవేదనతో తెలిపారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: