నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ పటాస్. 2015 జనవరిలో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఊహించని విధంగా ఎంతో మంచి సక్సెస్ ని అందుకుంది. కళ్యాణ్ రామ్ సరసన శృతి సోది హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సాయి కార్తీక్ మ్యూజిక్ ని అందించగా, కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. 

 

IHG

వాస్తవానికి ఈ సినిమా కథను, జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సిందని, అయితే ఆయన అప్పట్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండడంతో ఆ కథను కళ్యాణ్ రామ్ కు వినిపించడం జరిగిందని అప్పట్లో దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పడం జరిగింది. అంతకముందు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనిల్, తొలి సినిమాని ఎలాగైనా హిట్ చేయాలనే తలంపుతో పటాస్ కథను అన్ని వర్గాల ప్రేక్షకులను చేరువయ్యేలా పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో రాసుకోవడం జరిగింది. చిన్నప్పుడే తండ్రి వలన తల్లిని కోల్పోయిన హీరో, అక్కడి నుండి ఆయనపై పగ పెంచుకుని పోలీస్ ఆఫీసర్ అవుతాడు. 

 

ఆ తరువాత నుండి తండ్రిపై కక్షతో ముందుకు సాగుతున్న హీరోకు, తాను చెల్లెలిగా భావించే దివ్యంగురాలైన అమ్మాయి హఠాన్మరణం కేసు విషయం తెలుసుకుని మంచిగా మారిపోతాడు. ఆ తరువాత అతడు విలన్ ని ఎదిరించి ఆ అమ్మాయి కేసు ని ఏ విధంగా ఛేదించాడు అనేది సినిమా ముఖ్య కథాంశం. కాగా ఈ కథను దర్శకుడు అనిల్ తెరకెక్కించిన తీరుకి ఆయనను ఎంతైనా ప్రశంశించక తప్పదు. ఎందుకంటే ఇటువంటి ఎమోషనల్ స్టోరీలో కమర్షియల్ అంశాలు జోడించి ప్రేక్షక ఆమోదం పొంది అనిల్ నూటికి నూరు మార్కులు పొందారు. ఇక హీరో కళ్యాణ్ రామ్ అయితే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టడంతో పాటు ఈ సినిమా ఆయన మార్కెట్ రేంజ్ ని మరింత పెంచింది. ఆ విధంగా రిలీజ్ తరువాత పెద్ద హిట్ కొట్టి మంచి కలెక్షన్ సాధించిన ఈ పటాస్ సినిమా కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లో ఎంతో ప్రత్యేకం అని చెప్పుకోవాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: