గత కొన్నిరోజులుగా ‘ఆర్ ఆర్ ఆర్’ ను ఓటీటీ లో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారని పే ఫర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రాజమౌళి ఆలోచనలు ఉన్నాయి అంటూ వచ్చిన వార్తలు రాజమౌళి దృష్టివరకు వెళ్ళినట్లు టాక్. ఈ సినిమా టికెట్ 500 రూపాయలుగా నిర్ణయించి 8 భారతీయ భాషల్లో రిలీజ్ చేస్తే కేవలం 5 గంటల్లో 1200 కోట్ల రూపాయలు ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కలెక్ట్ చేసే అవకాశం ఉందని భావించిన రాజమౌళి ఈవిషయమై లోతుగా ఆలోచనలు చేస్తున్నాడు అంటూ పలు మీడియా సంస్థలలో వచ్చిన వార్తలను కొందరు జక్కన్న దృష్టివరకు తీసుకు వెళ్ళడంతో ఆ వార్తలు విని తానూ కూడ తెగ నవ్వుకున్నాను అని జోక్ చేసినట్లు టాక్.  


వాస్తవానికి ఈ న్యూస్ మూలాలు బాలీవుడ్ మీడియా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ మీడియాకు సౌత్ సినిమా డామినేషన్ నచ్చడంలేదు అన్నఅభిప్రాయం ఉంది. ‘బాహుబలి’ చిత్రానికి అనుకోకుండా పబ్లిసిటీ కల్పించిన బాలీవుడ్ మీడియా ఆతర్వాత దక్షిణాది చిత్రాలను ఎంతవరకు తగ్గించాలో అంతవరకు తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది.  


ఈనేపధ్యంలో రాజమౌళి తన సన్నిహితులతో స్పందిస్తూ ఇంకా నిర్మాణ దశలో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’ డిజిటల్ లో విడుదల చేయబోతున్నారని వార్తలు రావడం తనకు పెద్ద కామెడీ జోక్ గా నవ్వు తెప్పించిందని రాజమౌళి కామెంట్స్ చేసినట్లు టాక్. అంతేకాదు ఇలాంటి న్యూస్ లు బాలీవుడ్ మీడియా క్రియేట్ చేసి ‘ఆర్ ఆర్ ఆర్’ మార్కెట్ ను దెబ్బకొట్టాలని చూస్తోందా అన్నసందేహాలు కూడ తనకు కలుగుతున్నాయి అని రాజమౌళి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

 

వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తి అయి విడుదలకావడానికి ఇంకా ఏడాది కాలం పడుతుందని అప్పటికి ధియేటర్లు అన్నీ పూర్తిగా తెరుచుకుంటాయి కాబట్టి తనకు ఓటీటీ ఆలోచనలు ఎందుకు వస్తాయి అన్నఅభిప్రాయం జక్కన్నకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో విడుదలకి సిద్ధంగా ఉన్న సల్మాన్ ఖాన్ సినిమాను కూడ భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ డిజిటల్‌లో విడుదల చేయడానికి అంగీకరించడంలేదు. అదేవిధంగా కంగనా రనౌత్ ‘తలైవి’ మూవీని కూడ ధియేటర్స్ లోనే విడుదల చేస్తామని చెపుతున్నారు. తమిళ టాప్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీని కూడ ధియేటర్స్ లోనే విడుదల చేస్తామని చెపుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమాల కంటే భారీ బడ్జెట్ తో కూడిన ‘ఆర్ ఆర్ ఆర్’ డిజిటల్ లో విడుదల చేస్తారన్నది ఒక జోక్ అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: