ప్రస్థుత కరోనా పరిస్థితులలో సినిమాల షూటింగ్ లు లేకపోయినా సినిమాలు విడుదల కాకపోయినా మహేష్ ఫాలోయర్స్ సంఖ్య ఒక కోటి స్థాయికి చేరుకొని సోషల్ మీడియాలో ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం టాలీవుడ్ టాప్ యంగ్ హీరోలందరికీ షాక్ ఇచ్చింది. మహేష్ కు ఏర్పడ్డ ఈ కోటి అభిమానుల సంఖ్యతో దక్షిణాది సినిమారంగ హీరోలలో అగ్ర స్థానానికి చేరుకోవడంతో మహేష్ మ్యానియా దక్షిణాది అంతా హోరెత్తిపోతోంది.


ఇలాంటి పరిస్థితులలో మహేష్ ఈ రికార్డులను అందుకోవడానికి ఈ లాక్ డౌన్ సమయంలో మహేష్ తన పిల్లలు గౌతమ్ సితార లతో కూడిన రకరకాల వెరైటీ ఫోటోలను షేర్ చేయడం ఒక కారణం అంటూ కొన్ని కామెంట్స్ కూడ వచ్చాయి. ఇప్పుడు ఈ కామెంట్స్ జూనియర్ దృష్టి వరకు వెళ్ళడంతో జూనియర్ ఆలోచనలు కూడ మారే ఆస్కారం ఉంది అంటున్నారు.


వాస్తవానికి మహేష్ బన్నీ పిల్లల ఫోటోలకు ఎంత క్రేజ్ ఉంటుందో జూనియర్ పిల్లలు భార్గవ్ రామ్ అభయ్ రామ్ లకు సంబంధించిన ఫోటోలకు కూడ మంచి క్రేజ్ ఉంది. అయితే జూనియర్ తరుచు తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసే విషయంలో అంతగా శ్రద్ధ పట్టడు.


దీనితో షూటింగ్ లు లేనప్పుడు జూనియర్ తన పిల్లలతో ఎలా సరదాగా కాలం గడుపుతాడు అన్న విషయం తెలుసుకోవాలని జూనియర్ అభిమానులతో పాటు అనేకమంది ఆశ పడుతూ ఉంటారు. అయితే జూనియర్ వారి ఆశలను పెద్దగా పట్టించుకోడు. దీనితో స్టార్ హీరోలు తమ పిల్లలతో చేసే హడావిడికి సంబంధించిన ఫోటోలను బట్టి కూడ సోషల్ మీడియాలో ఫాలోయర్స్ పెరిగిపోతున్న పరిస్థితులలో మహేష్ ను ఆదర్శంగా తీసుకుని జూనియర్ ను తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎక్కువగా షేర్ చేయమని అభిమానులతో పాటు సన్నిహితుల పై ఇస్తున్న సలహాల పై జూనియర్ లేటెస్ట్ ఆలోచనలు అని తెలుస్తోంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: