కమెడియన్ బ్రహ్మానందం సినిమాలకు గుడ్ బై చెప్పి బుల్లి సీరియల్స్ లో నటించే ఆలోచనలు చేస్తున్నాడని గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలు బ్రహ్మానందం దృష్టికి ఒక మీడియా సంస్థ తీసుకు వెళ్ళినప్పుడు ఆ వార్తల పై  బ్రహ్మి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. సోషల్ మీడియా రూమర్స్ రావాడం కామన్ గా మారిపోయింది అని అంటూ ప్రతి విషయంపై స్పందిస్తే సమయం సరిపోదని  అభిప్రయా పడ్డాడు.  


తనకు రెగ్యులర్ పాత్రలు బోర్ కొట్టేయడంతో కొన్ని సినిమాలను కూడా రిజెక్ట్ చేశానని చెపుతూ తన రిటైర్ మెంట్ వార్తలు విని తనకు రోజుకు లెక్కలేనన్ని ఫోన్స్ వస్తున్న విషయాన్ని తెలియచేశాడు. ఈ ఫోన్స్ కు ఆన్సర్ చేయడం తనకు ఒక పెద్ద పనిగా మారింది అంటూ జోక్ చేసాడు. తాను చెప్పని మాటలు కూడ తాను చెప్పినట్లుగా మీడియాలో ఎలా వార్తలు గా వచ్చేస్తున్నాయో తనకు అర్ధం కావడం లేదు అంటూ బ్రహ్మీ అసహనాన్ని వ్యక్త పరిచాడు. 


గత మూడు నెలల నుండి తాను ఇంటి నుండి ఎక్కడకి వెళ్ళడం లేదని వరసపెట్టి పుస్తకాలు చదువుతూ తాను కాలం గడుపుతున్న విషయాన్ని తెలియచేసాడు. ఈ లాక్ డౌన్ పిరియడ్ లో తాను ఖురాన్ చదివి చాలమంచి విషయాలు తెలుసుకున్నాను అని చెపుతూ ఖురాన్ లో ఉండే మంచి విషయాలు తనకు అర్ధం అయ్యేలా ఈ కరోనా లాక్ డౌన్ తనకు ఎంతో మేలు చేసింది అని బ్రహ్మీ అభిప్రాయపడుతున్నాడు. 


వాస్తవానికి వెన్నెల కిషోర్ లాంటి టాలెంటేడ్ కమెడియన్ క్రేజ్ పెరిగిన తరువాత బ్రహ్మానందంకు అవకాశాలు తగ్గిన మాట వాస్తవం. దీనికితోడు ఈయన పారితోషికం కూడ చుక్కలు తాకిన పరిస్థితిలో బ్రహ్మీని చాలామంది పక్కకు పెట్టారు. ఒకప్పుడు టాప్ హీరోలు అంతా బ్రహ్మానందం డేట్స్ బట్టి తమ డేట్స్ ను ఇచ్చేవారు. ఇప్పుడు ఆ హవా తగ్గిపోవడంతో బ్రహ్మానందం తన నైరాశ్యాన్ని ఇలా ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ తిరిగి ఉత్సాహం పొందడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకోవాలి..  

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: