టాలీవుడ్ డేరింగ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. బాలీవుడ్ లో ఈ మూవీని కరణ్ జోహార్ రిలీజ్ చేస్తుండటం విశేషం. ఈ సినిమాలో బాలీవుడ్ హ్యాపెనింగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. హీరోయిన్స్ విషయంలో పూరి లెక్క వేరేలా ఉంటుంది.

 

తన సినిమాను చూడటానికి వచ్చే మాస్ ఆడియెన్స్ కు హీరోయిన్స్ అందాలతో ఫుల్ మీల్స్ పెట్టి సాటిస్ఫై చేస్తాడు. అందుకే పూరి ఇంట్రడ్యూస్ చేసే హీరోయిన్స్ కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. లేటెస్ట్ గా అనన్యా పాండేకి కూడా అదే లక్ ఫ్యాక్టర్ తోడవుతుంది. తెలుగులో కనీసం ఒక సినిమా కూడా రిలీజ్ కాకుండానే అమ్మడిని తమ సినిమాలో తీసుకునేందుకు దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా సినిమా రిలీజ్ కాకుండానే ఇలా ఉంది అంటే రిలీజ్ తర్వాత ఇంకా ఎక్కువ ఛాన్సులు వచ్చే పరిస్థితి కనబడుతుంది. 

 

పూరి డైరక్షన్ లో వచ్చే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే హీరోయిన్స్ కు సూపర్ కెరియర్ ఉంటుంది. పూరి సినిమాలో హీరోలు టిపికల్ మైండ్ సెట్ తో ఉంటారు. హీరోయిన్స్ మాత్రం వారు ఏం చేసినా వారిని ప్రేమించే వారిగా కనిపిస్తారు. చూస్తుంటే అనన్యా పాండే కూడా తెలుగులో ఓ ఊపు ఒప్పేలా ఉంది. ఇప్పటికే బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన అనన్యా పాండే తెలుగులో ఎలాంటి పాపులారిటీ తెచ్చుకుంటుందో చూడాలి.                                  

మరింత సమాచారం తెలుసుకోండి: