ఈమధ్య థమన్ బాగా ఫాం లో ఉండటంతో దేవి శ్రీ ప్రసాద్ వెనకపడ్డాడు. దేవికి స్టార్ సినిమా ఛాన్సులు వస్తున్నా ఎందుకో ఇదివరకు ఉన్నంత జోష్ కనబరచడం లేదు. గత రెండేళ్లలో దేవి మ్యూజిక్ అందించిన సినిమాల కన్నా థమన్ మ్యూజిక్ అందించిన సినిమాల సందడి ఎక్కువ ఉంది. ఇక త్రివిక్రం డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో కెరియర్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చి దుమ్ముదులిపేశాడు థమన్.

 

దేవి శ్రీ కూడా తక్కువేమి కాదు.. రంగస్థలం, మహర్షి సినిమాలతో తమ సత్తా చాటాడు. అయితే ఎక్కడో దేవి తన మార్క్ మిస్ అవుతున్నాడని అనిపిస్తుంది. అయితే ఒకరు ఫాం లో ఉన్నప్పుడు మరొకరు వెనక్కి తగ్గడం కామనే కాని దేవి హుశారైన మ్యూజిక్ లో సంథింగ్ మిస్ అవుతుందన్న భావన కలుగుతుంది. ఇక దీనికితోడు కొత్త మ్యూజిక్ డైరక్టర్స్ కూడా కొత్త మ్యూజిక్ తో అలర్స్తున్నారు. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప.

 

సుకుమార్ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమాతో దేవి మళ్లీ అసలు సిసలు సత్త చాటాలని చూస్తున్నాడు. సుక్కు ఆర్య నుండి ఏ సినిమా చేసినా డిఎస్పినే మ్యూజిక్.. సుకుమార్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన దేవికి తన సినిమాతో మరోసారి బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నాడు సుకుమార్. అందుకే ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాకు రెమ్యునరేషన్ లేకుండా చేయడం అంటే అది త్యాగమనుకోవాలా.. లేక స్నేహం అనుకోవాలా అన్నది తెలియాల్సి ఉంది. మరి పుష్పతో కొత్త దేవి శ్రీ ప్రసాద్ ను చూస్తామా లేదా అన్నది సినిమా నుండి సాంగ్స్ వస్తేనే కాని చెప్పలేం.           

మరింత సమాచారం తెలుసుకోండి: