మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్సినిమా చేస్తాడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. హీరోగా సూపర్ ఫాం లో ఉన్న చరణ్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్న చరణ్ ప్రస్తుతానికి చిరుత్ సినిమాలే చేస్తున్నాడు. అయితే తన ప్రొడక్షన్ హౌజ్ లోనే బయట హీరోలతో సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు. కేవలం సినిమాలే కాదు వెబ్ సీరీస్ లను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట.

 

సిని లవర్స్ కు ఓటిటిలో వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. తెలుగులో కొత్తగా ఆహా ఓటిటి ఈమధ్యనే స్టార్ట్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆహా కోసం వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ చాలా కావాల్సి ఉందట. అందుకే చరణ్ నిర్మాతగా మారి వెబ్ సీరీస్ లను నిర్మించాలని ఫిక్స్ అయ్యాడట. తక్కువ బడ్జెట్ తో పూర్తయ్యే వెబ్ సీరీస్ లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. బాగా క్లిక్ అయితే చాలు వెబ్ సీరీస్ ల మీద కూడా మంచి లాభాలు పొందొచ్చు.

 

ఈమధ్య అందరు వెబ్ సీరీస్ ల మీద దృష్టి పెడుతున్నారు. సినిమా మేకర్స్ కు కూడా అక్కడ చేతినిండా పని ఉంటుంది. స్టార్ హీరో రాం చరణ్ కూడా వెబ్ సీరీస్ ల మీద కన్నేశాడు. సినిమాలు నిర్మిస్తూ సందడి చేస్తున్న చరణ్ కొత్తగా వెబ్ సీరీస్ లను కూడా చేస్తే ఇక తిరుగు ఉండదని చెప్పొచ్చు. హీరోగానే కాదు నిర్మాతగా మేనమామని ఫాలో అవుతున్నాడు రాం చరణ్. కచ్చితంగా నిర్మాతగా కూడా చరణ్ సక్సెస్ అవుతాడని చెప్పొచ్చు.        

మరింత సమాచారం తెలుసుకోండి: