తన తాతయ్య మహారాజు అయినా తన నాన్న మహా మంత్రి అయినా మధ్యతరగతి వ్యక్తి లాగానే  జీవితాన్ని కొనసాగిస్తాడు కళ్యాణ్ రామ్. స్టార్డమ్ ఉన్నా అత్యంత సాధారణ జీవితానికి మొగ్గు చూపే కళ్యాణ్ రామ్ ఈరోజు తన 42వ వసంతంలోకి అడుగుపెట్టాడు. 1978 జూలై 5వ తేదీన నందమూరి హరికృష్ణ, లక్ష్మి దంపతులకు హైదరాబాద్ నగరంలో జన్మించాడు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ కి అన్నయ్య జానకిరామ్, చెల్లి సుహాసిని, తమ్ముడు తారక్ ఉన్నారు. మొదటి తరగతి నుంచి ఏడవ తరగతి వరకు కళ్యాణ్ రామ్ ఎస్టీ పాల్స్ పాఠశాలలో చదువుకున్నాడు. ఈ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న సమయంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బాలగోపాలుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.


కళ్యాణ్ రామ్ ఏడవ తరగతి పూర్తి చేసిన అనంతరం విజయవాడలోని కెసిపి సిద్ధార్థ ఆదర్శ్ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. తదనంతరం బిట్స్ పిలానీ పరీక్ష రాసి ఎన్టీ రామారావు చేత తెగ పొగిడించుకున్నాడు. ఇతను గుంటూరులోని వికాస్ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ విద్యాభ్యాసం పూర్తి చేసాడు. అయితే ఈ వికాస్ జూనియర్ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో అతడు హాస్టల్లో ఉంటూ ఆర్టీసీ బస్సులో కాలేజీకి వెళ్ళి వచ్చేవాడు. కొన్ని సార్లు కాలేజీకి నడుచుకుంటూనే  వెళ్ళేవాడు. ఇంజనీరింగ్ చదువును కోయంబత్తూర్లో పూర్తిచేసిన కళ్యాణ్ రామ్ మాస్టర్ డిగ్రీ సంపాదించాలని చికాగో లోని ప్రముఖ ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో చేరాడు.



మాస్టర్ డిగ్రీ పట్టాను పొందిన అనంతరం అక్కడే ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం పాటు జీవితాన్ని గడిపాడు. నందమూరి వంశం లోనే మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం సాధించిన ఏకైక వ్యక్తిగా కళ్యాణ్ రామ్ పేరుపొందాడు. ఒక సంవత్సరం పాటు ఉద్యోగం చేసిన తర్వాత తాను కూడా తన తమ్ముడు తారక్ లాగా హీరో అవ్వాలని అనుకుని ఉద్యోగం మానేసి ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత హీరోగా అరంగేట్రం చేయడం నందమూరి అభిమానులను అలరించడం చకచకా జరిగిపోయాయి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: