టాలీవుడ్ లో  జూనియర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ కి ఉన్న ఫాలోయింగ్ అనేది అందరికి తెలిసిందే. తారక్ సినిమా వస్తుంది అంటే చాలు జనాలు హాల్ ముందు క్యూ కట్టే పరిస్థితి అయితే ఉంటుంది అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు తారక్. ఇక ఆ సినిమా కోసం అటు బాలీవుడ్ లో కూడా ఎదురు చూస్తున్నారు అంటే ఆ సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉంది అనేది అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత అతను త్రివిక్రమ్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. 

 

ఇక దీని టైటిల్ విషయంలోనే ఒక చర్చ నడుస్తుంది. ఇది పక్కన పెడితే ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్ ని కళ్యాణ్ రామ్  ఎప్పుడు కూడా వాడుకునే ప్రయత్నం కనీసం చేయలేదు అనే సంగతి అందరికి తెలిసిందే. ఏ సినిమా విడుదల చేసినా సరే తమ్ముడి కి ఉన్న ఫాలోయింగ్ ని సోషల్ మీడియాలో అతను వాడుకున్న సందర్భం గాని ప్రధాన మీడియా లో వాడుకున్న సందర్భం గాని ఎక్కడా లేదు.  ఎంతో సన్నిహితంగా ఉన్నా సరే వాళ్ళు సినిమాలను మార్కెట్ చేసుకునే విషయంలో ఎప్పుడు కూడా అలా వ్యవహరించలేదు అనే సంగతి తెలిసిందే. 

 

ఇప్పుడు ఇద్దరూ కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి అయితే ఆ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. ఈ సినిమాను హారిక అండ్ హాసిని బ్యానర్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల అయ్యే సూచనలు అయ్యే సూచనలు ఉన్నాయని అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: