మన తెలుగు లో నందమూరి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు వారి చరిత్ర గురించి అందరికి తెలిసిన విషయమే. వారిలో వారికి ఏ విభేదాలు ఉన్నా సరే వారు ఉన్న రంగాల వరకు మాత్రమే పరిమితం చేస్తూ ఉంటారు గాని వాటిని ఎప్పుడు కూడా బయటకు తీసుకుని వచ్చి అల్లరి చేసుకున్న సందర్భం ఎప్పుడు కూడా లేదు అనే చెప్తారు టాలీవుడ్ లో. ఇప్పుడు అయినా అప్పుడు అయిన యెప్పుడు అయినా సరే ఆ ఫ్యామిలీ అలాగే ఉంది. ఇక అది అలా ఉంటే వారిలో  కాస్త కుటుంబ విలువలు కూడా ఎక్కువగానే ఉంటాయి అని అంటారు. 

 

పెద్దలతో విభేదాలు ఉన్నా సరే పిల్లలు వాటిని అక్కడే వదిలేయడమే  గాని వాటిని సాగదీసి అల్లరి చేసుకునే ప్రయత్నం చేయడం అనేది చాలా తక్కువగా చెప్తూ ఉంటారు. తాజాగా ఒక విషయం ఏంటీ అంటే నందమూరి ఫ్యామిలీ లో నందమూరి బ్రదర్స్ గా  ఉన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఎన్నో గొడవలు ముందు పడ్డారు అని అంటారు. కాని తర్వాత వాటిని ఎక్కడా కూడా వాళ్ళు ఇద్దరూ బయట చూపించలేదు. ఎన్టీఆర్ కి తండ్రి గా ఉన్నాడు కళ్యాణ్ రామ్ అనే సంగతి అందరికి తెలిసిన విషయమే. 

 

 అన్నగానే కాదు అన్ని విధాలుగా కూడా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కి అండగా ఉంటాడు అని టాలీవుడ్ లో అంటూ ఉంటారు. ఏ విషయం అయినా సరే ముందు అన్నకు చెప్పిన తర్వాతనే తారక్ నిర్ణయాలు తీసుకుంటాడు అని అంటారు టాలీవుడ్ జనాలు. అది ఎంత వరకు నిజం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని వారి విషయంలో మాత్రం  ఇప్పుడు రూమర్స్ కూడా బయటకు వచ్చిన సందర్భం అనేది పెద్దగా లేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: