టాలీవుడ్ లో బ్రదర్స్ కాంబినేషన్ లో సినిమా రావాలి అని మెగా ఫ్యామిలీ విషయంలో అనుకున్నారు నందమూరి ఫ్యామిలీ విషయంలో అనుకున్నారు. కాని ఆ విషయంలో బ్రదర్స్ మాత్రం ముందుకు అడుగు వేయలేదు. అయితే బ్రదర్స్ నిర్మాతలు గా సినిమాలు మాత్రం వస్తున్నాయి. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలిసి ప్రత్యక్షంగా సినిమాలను చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరో గా కళ్యాణ్ రామ్ నిర్మాతగా సినిమాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు రెండు సినిమాలు వీరి కాంబినేషన్ లో ఖరారు అయిన సంగతి తెలిసిందే. 

 

జై లవకుశ సినిమాను ఇద్దరూ కలిసి చేసారు. ఇక ఇప్పుడు మరో సినిమా త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేస్తున్నారు. అయితే తమ్ముడి సినిమాలో పెట్టుబడి పెట్టడానికి కళ్యాణ్ రామ్ ముందు నుంచి కూడా ఎక్కువగా ఆసక్తిగా ఉంటాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వీరు ఇద్దరూ కలిసి ఎప్పుడో సినిమా చెయ్యాల్సి ఉంది అని కాని అది ఆలస్యం అయింది అని ఇప్పుడు ఆ విధంగా ముందుకు అడుగు పడుతుంది అని అంటున్నారు. ఎప్పటి నుంచో వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని చూసినా సరే జై లవకుశ వరకు కూడా ఆ అడుగు పడలేదు. 

 

ఇప్పుడు వీరు ఇద్దరూ కలిసి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది మరి. ఇప్పుడు తారక్ ఒక ప్రాజెక్ట్ ని వాయిదా వేసుకునే సూచనలు కూడా ఈ  సినిమా కోసం ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది మరి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటీ అంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో కళ్యాణ్ రామ్ నిర్మాత మాత్రమే కాదు అందులో నటిస్తున్నాడు అని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: