రూలర్ సినిమా తర్వాత బాలయ్య మార్కెట్ బాగా దెబ్బతింది. కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య లుక్  బాలేదని అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేసారు. అయితే ఈ సినిమా అనంతరం బోయపాటితో జతకట్టిన బాలయ్య, బోయపాటి మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఇటు బాలయ్య అభిమానుల్లోనూ నమ్మకం పెరిగింది.

 

 

అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకూ వచ్చిన రెండు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్లే. కానీ ప్రస్తుతం ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు. దాంతో మొదట్లో ఈ కాంబినేషన్ పై కొద్దిగా అనుమానాలు వ్యక్తం చేసారు. అయితే తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా నుండి వీడియో గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. బాలయ్య పవర్ ఫుల్ డైలాగుతో ఉన్న ఆ వీడియోకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

 

ఏకంగా పదిమిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లోకి వచ్చింది. ముఖ్యంగా ఈ వీడియోలో బాలయ్య అభిమానులని సంతృప్తి పర్చిన అంశం.. బాలయ్య లుక్. పంచెకట్టులో బాలయ్య చాలా బాగున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ పై అనేక కథనాలు వెలువడుతున్నాయి. మొన్నటి వరకూ ఈ సినిమాకి మోనార్క్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారని అన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మరో కొత్త టైటిల్ వినబడుతుంది.

 

సూపర్ మాన్ అనే టైటిల్ ని పరిశీలీస్తున్నారని సమాచారం. పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టే నేపథ్యంలో ఈ టైటిల్ ని ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. ఈ విషయమై సోషల్ మీడియాలో అనే కథనాలు వెలువడుతున్నాయి. మరి చిత్రబృందం అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో బాలయ్య పక్కన కొత్త అమ్మాయి హీరోయిన్ గా చేయనుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: