టాలీవుడ్  స్టార్ హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ప్రియమణి హీరోయిన్ గా వస్తున్న చిత్రం నారప్ప. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వి క్రియేషన్స్ బ్యానర్లపై వస్తున్న ఈ సినిమా...  ప్రస్తుతం లాక్ డౌన్ లో వాయిదా పడింది. ఈ సినిమాను అనంతపురం ఫ్యాక్షన్ ఆధారంగా వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా వస్తున్న ఈ తమిళ రీమేక్ సినిమా కావడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నలేకోంది. ఈ సినిమాను దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. 

 

ఇక ఈ సినిమాలో నారప్ప భార్య సుందరమ్మగా ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ ముగ్గురు పిల్లల తండ్రిగా నటిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌‌న్నాగా ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తిక్ ర‌త్నం నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు కార్తిక్ పుట్టిన రోజు కావడంతో అతని లుక్ ని విడుదల చేసింది. సైకిల్ తొక్కుతూ అతను వెళ్తూ ఉన్న లుక్ ని విడుదల చేసారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఈ సినిమా వేసవిలో విడుదల అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. 

 

సినిమా తర్వాత వెంకటేష్ వచ్చే ఏడాది మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో రానా తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాలో వెంకటేష్ పాత్రకు సంబంధించిన కీలక షూటింగ్ పూర్తి అయింది. ఈ సినిమాలో ప్రియమణి పాత్రకు సంబంధించిన లుక్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేయగా దానికి కూడా సోషల్ మీడియా లో మంచి స్పందన వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: