ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుని పదేళ్లుగా తెలుగు, తమిళ సినిమాలను  ఏలేస్తున్న హీరోయిన్ సమంత. ఈ భామ కెరీర్లో ఫ్లాపులెన్నున్నాయో చూడాలే కానీ హిట్లు గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతటి హిట్ పర్సంటేజ్ సమంత సొంతం. చిలిపి, అల్లరి.. పాత్రలే కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో సమంత రాణించి సూపర్ స్టార్ డమ్ తెచ్చుకుంది. ఆమె కెరీర్లో అల్లరి, చిలిపి, భావోద్వేగం.. అన్నీ సమపాళ్లలో ప్రదర్శించిన సినిమా ‘ఓ..బేబీ’. ఈ సినిమా విడుదలై నేటికి ఏడాది పూర్తైంది.

IHG

 

నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గత ఏడాది జూలై 5న విడుదలైంది. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలో సమంత విశ్వరూపమే చూడొచ్చు. డబ్బై ఏళ్ల బామ్మ.. 25 ఏళ్ల యువతిగా మారిపోయిన పాత్రలో సమంత నటన అద్భుతం. తన నటనలోని షేడ్స్ అన్నింటినీ ఈ ఒక్క సినిమాలో ప్రదర్శించి శెభాష్ అనిపించింది. డ్యాన్సులు, అల్లరి, చిలిపి, అమాయకత్వంతో మెప్పించింది.. క్లైమాక్స్ లో కూడా సమంత నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సమంత ఓ బేబీలో వన్ ఉమెన్ షో చేసిందని చెప్పాలి.

IHG

 

కొరియన్ సినిమాకు రీమేక్ చేసిన దర్శకురాలు నందిని రెడ్డి తన దర్శకత్వ ప్రతిభ చూపించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు మేజర్ ప్లస్. పాటల్నీ వీనులవిందైన సంగీతంతో ఆకట్టుకున్నాయి. మిగిలిన పాత్రల్లో వెటరన్ నటి లక్ష్మి సినిమాకు సగం ప్రాణం. రాజేంద్రప్రసాద్, నాగశౌర్య, రావు రమేశ్ పాత్రలు కీలకంగా నిలిచాయి. వెరసి.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన ఓ మంచి కుటుంబ కథగా ఓ బేబీ నిలిచిపోయింది. సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మాత సురేశ్, విశ్వప్రసాద్, సునీత తాతి ఈ సినిమా నిర్మించారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: