రాజీవ్ గాంధీ హత్య కేసు... దశాబ్దాల నుంచి నడుస్తూనే ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నళినీ సహా కొందరు ఇంకా జైలు లోనే ఉన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నా సరే వారు  ఇంకా జైలు లో శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సమన్వయ లోపం కారణంగా వారు జైలు లోనే మగ్గుతున్నారు. గాంధీ కుటుంబం వారిని క్షమించినా సరే ఇప్పుడు వారు బయటకు వచ్చే అవకాశాలు మాత్రం కనపడటం లేదు. పోనీ తమకు చనిపోయే అవకాశం ఇవ్వాలి అని కోరినా సరే ఇవ్వడం లేదు. 

 

ఎప్పుడో జయలలిత సర్కార్ వారి విడుదలకు అనుమతి ఇచ్చింది. కాని కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చే వరకు కూడా వారికి మోక్షం లభించే సూచనలు మాత్రం దాదాపుగా కనపడటం లేదు అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన  నిందితురాలి గా ఉన్న నళిని బయోపిక్ ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. నాట‌క రంగంలో తొమ్మిదిసార్లు జాతీయ అవార్డును సొంతం చేసుకున్న మ‌హేంద్ర కొక్కిరిగ‌డ్డ ఈ బ‌యోపిక్‌ను తీయడానికి గానూ సిద్దం అయ్యారు అనే వార్తలు వస్తున్నాయి. న‌ళిని, ఆమె భ‌ర్త‌ మురుగ‌న్‌(శ్రీహ‌ర‌న్‌) ప్రేమ‌క‌థ‌ను ఈ బ‌యోపిక్‌లో చూపించే అవకాశం ఉంది. 

 

వారు ఏ విధంగా కలిసారు వారి ప్రేమ ఎలా మొదలయింది సహా అనేక విషయాలను ఇందులో దర్శకుడు చూపించే అవకాశం ఉంది. ఇక జైలు కి వెళ్ళిన తర్వాత వారు పడే కష్టాలను కూడా ఈ సినిమాలో చూపించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కూడా జైలు కి వెళ్ళిన తర్వాత నరకం చూసారు. ఒకరిని ఒకరు చూసుకునే అవకాశం కూడా లేదు అని అంటూ ఉంటారు. మరి  వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: