బాలయ్య బోయపాటి సినిమా అనగానే  జనాలకు ఒక రేంజ్ లో ఆసక్తి ఉంటుంది. సినిమా కథ ఏ విధంగా ఉంటుంది... సినిమాలో ఏ విధంగా బాలయ్య ను బోయపాటి శ్రీను చూపించే అవకాశం ఉంది అనే దాని మీద చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇక బోయపాటి కూడా బాలయ్య సినిమా అనగానే ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ సినిమా ఇప్పుడు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఎలా అయినా సరే ఈ సినిమాను విడుదల చెయ్యాలి అని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ సినిమాలో బాలయ్య ను ఏ విధంగా చూపిస్తారు అనేదే సర్వత్రా ఆసక్తి. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై ఇప్పుడు చాలా పేర్లు వినపడుతున్నాయి. ప్రధానంగా ముందు అంజలి అనుకున్నారు గాని ఆమె కాదు అని తెలిసింది. ఇప్పుడు నయనతార అని అంటున్నారు. ఆమె కూడా కాదు మరో హీరోయిన్ అని టాలీవుడ్ లో టాక్. మెగా హీరోలు రామ్ చరణ్ అల్లు అర్జున్ తో కలిసి నటించిన అమలాపాల్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఇప్పుడు  బాలయ్య పాత్రను కాస్త ఫ్యాక్షన్ కోణం లో చూపించే అవకాశం ఉంది అంటున్నారు. 

 

సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడగా వచ్చే నెల లో  షూటింగ్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి.  నిజమా కాదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా తర్వాత ఆయన సినిమా ఏంటో...

మరింత సమాచారం తెలుసుకోండి: