హీరో విశాల్ ఆయన విలక్షణమైన నటనతో ఒక్క తమిళనాడులోనే కాకుండా గెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఆయన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటారు విశాల్. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలు చేసి హిట్ కొడుతున్నాడు విశాల్. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాత గా కూడా బిజీ గా ఉన్నాడాయన. ప్రస్తుతం ఆయన 'చక్ర' అనే మూవీ చేస్తున్నారు.

 ఇటీవల చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. చక్ర మూవీ టీజర్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది.  చక్ర మూవీ టీజర్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఎప్పుడూ ఓకే రకమైన సినిమాలు కాకుండా విలక్షణమైన కథలను ఎంచుకొని మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విశాల్. ఇలాంటి సమయంలో విశాల్ ఓ యువతి పై కేస్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అసలేం జరిగిందంటే...విశాల్ కంపెనీ లో పనిచేస్తున్న ఆ యువతి అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు.


 షూటింగ్ సమయంలో లక్షల రూపాయలు పక్కదారి పట్టించిట్లు తేలింది. విశాల్ కంపెనీ లో పనిచేసే సదరు మహిళ గత ఆరేళ్లలో రూ .45 లక్షలకు పైగా మోసం చేసి డబ్బు కూడబెట్టినట్టు బయటపడింది. అయితే ఇన్నేళ్ల లో ఎప్పుడూ బయటకు ఎందుకు రాలేదు, కూడబెట్టిన డబ్బు దేనికి వాడుకున్నారు , ఎలా దారిమళ్లించింది వంటి కోణాల్లో విచారించారు. ఈ డబ్బుతో ఇల్లు కూడా కొన్నదని.


ఈ విషయం తెలుసుకున్న ప్రొడక్షన్ హౌస్ మేనేజర్ హరి చెన్నైలోని వడపాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆమెపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. విశాల్ వంటి పేరున్న నిర్మాత కంపెనీలో ఇలా జరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం విశాల్ చక్ర  సినిమాలో నటించడం ఇలాంటి సమయం లో మోసపోయిన ఘటనలు బయటపడటం కోలీవుడ్ లో గుసగుసలకు తావిస్తోంది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: