యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ బోయ‌పాటి శీను కాంబినేష‌న్ అంటో తెలుగు సినీ ప్రేక్ష‌కుల్లో ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన సింహా, లెజెండ్ రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు బాలయ్య , బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న BB3 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ రోర్ ను విడుదల చేశారు. ఈ ఫ‌స్ట్ రోర్‌లో బాల‌య్య చెప్పిన లంబిడీ కొడ‌కా డైలాగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

 

ఇక ఈ సినిమా గురించి రెండు లేటెస్ట్ అప్ డేట్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కొద్ది రోజుల నుంచి తీవ్ర చ‌ర్చలు న‌డుస్తున్నాయి. ప‌లువురు హీరోయిన్ల పేర్లు ప‌రిశీలించి ఓ హీరోయిన్‌ను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన అమలాపాల్ నటించబోతుందని సమాచారం. బాల‌య్య‌, బోయ‌పాటి కాంబోలో వ‌చ్చిన రెండు సినిమాలు ఎంత‌లా హిట్ అయ్యాయో అంత‌లా ఆ రెండు సినిమాల టైటిల్స్ కూడా చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఓ సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ పెడుతున్న‌ట్టు తెలుస్తోంది.

 

ఈ సినిమాకు ఇప్ప‌టి వ‌ర‌కు మోనార్క్, అఘోర అనే టైటిల్ లు ఎక్కువగా వినిపించగా కొత్తగా మరో టైటిల్ ఇప్పుడు తెరమీదకు వచ్చింది. కథకు సూపర్ మాన్ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ పై ఇంట్రస్ట్ గా ఉన్నాడని సమాచారం. దీంతో సూప‌ర్‌మాన్ అన‌గానే సినిమాపై మ‌రింత‌గా అంచ‌నాలు పెరిగిపోయాయి. మ‌రి ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్ర‌క‌టించే వ‌ర‌కు ఈ స‌స్పెన్స్ త‌ప్పేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: