లాక్ డౌన్ టైమ్ లో సెలబ్రెటీస్ ఒక్కొక్కరూ ఒక్కో పనిలో నిమగ్నమైపోయారు. హీరోలు చాలామంది.. పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. హీరోయిన్స్ వంట వార్పుతో సందడి చేస్తున్నారు. కానీ నిత్యామీనన్ మాత్రం.. లాక్ డౌన్ టైమ్ లో రైటర్ గా మారింది. తన డ్రీమ్ ను తీర్చుకోవడానికి తొలి ప్రయత్నంగా రచయిత అవతారం ఎత్తింది. కాస్త హైట్ తక్కువైనా.. కాస్త బొద్దుగా కనిపించినా.. టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది నిత్యామీనన్. 2006లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఈ మధ్యనే 50చిత్రాలు పూర్తి చేసింది. తెలుగులో కథానాయకుడు తర్వాత కనిపించకపోయినా.. ఒకటీ అర తమిళ.. మలయాళ సినిమాలతో పాటు హిందీ వెబ్ సిరీస్ బ్రీత్ సీజన్ 2లో నటిస్తోంది నిత్యమీనన్. 

 

బొద్దుగుమ్మగా పేరు తెచ్చుకున్న నిత్యమీనన్.. ఎలాంటి వర్కవుట్స్ చేసిందో గానీ.. సన్నగా కనిపిస్తోంది. నిత్యకు ఏమైంది.. అని అనుమానం వచ్చేలా మేకోవర్ అయి ఫేస్ లో కళ పోగొట్టుకుంది. లాక్  డౌన్ టైమ్ ను నిత్య బ్రహ్మాండంగా ఉపయోగించుకుంది. అందరిలా వంటింటి జోలికి వెళ్లకుండా పెన్ను.. పుస్తకం పట్టుకొని కథ రాయడం మొదలుపెట్టింది. మెగా ఫోన్ పట్టి డైరెక్ట్ చేయాలన్న కల  ఈ అమ్మడికి ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలో కథ ప్రిపరేషన్ లో లాక్ డౌన్ టైమ్ ను గడిపేసింది. ఓన్లీ డైరక్షనేనా.. నిర్మాతగా కూడా మారుతుందో తెలియదు కానీ.. భానుమతి.. సావిత్రి.. విజయనిర్మల.. జీవిత దారిలో నడుస్తూ డైరెక్టర్ అనిపించుకోనుంది నిత్యమీనన్. 

 

కరోనా అల్లకల్లోలం సృష్టిస్తున్న వేళ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే సెలబ్రెటీస్ ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కొందరు జిమ్ ఎక్యుప్ మెంట్స్ తో బాడీ బిల్డప్ చేసుకుంటే.. ఇంకొందరు సన్నజాజిలా తయారేందుకు కసరత్తులు చేశారు. మరికొందరు ఇంట్లో గార్డెనింగ్.. ఇంకొందరు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కొందరు సెలబ్రెటీస్ అయితే ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా వలస కార్మికులకు సాయం చేసే పని కూడా పెట్టుకున్నారు. అయితే నిత్యామీనన్ మాత్రం అందరి కంటే కొత్తగా ఆలోచించింది. తనలోని మరో టాలెంట్ ను బయటికి తీసింది. నటనతో పాటు రచయిత కూడా తనలో ఉన్నారని నిరూపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: