కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు అక్కడ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. దాదాపు రజినికాంత్ కు ఈక్వల్ ఫ్యాన్స్ ఉన్న విజయ్ తన ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక అంశంతో వస్తాడు. ఇక విజయ్ తో కలిసి నటించడానికి అక్కడ మిగతా నటీనటులు ఆసక్తి చూపిస్తారు. అయితే అనూహ్యంగా కోలీవుడ్ విలన్ నెపోలియన్ మాత్రం విజయ్ సినిమాలో ఇక మీదట నటించేది లేదని తెగేసి చెప్పాడు. పోకిరి సినిమా టైం లో విజయ్ తో నెపోలియన్ కు గొడవ జరిగింది. అందుకే ఇక మీదట విజయ్ సినిమాల్లో నటించేది లేదని చెప్పాడు నెపోలియన్.

 

దాదాపు కోలీవుడ్ లో స్టార్స్ అందరితో నటించిన నెపోలియన్ అజిత్ సినిమాలో నటించలేదని.. ఛాన్స్ వస్తే అజిత్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటానని అన్నారు. అయితే విజయ్ తో ఒకప్పటి గొడవని గుర్తుచేసుకుని అతనితో నటించని చెప్పి అజిత్ తో ఛాన్స్ వస్తే సినిమా చేస్తానని చెప్పడం చూసి నెపోలియన్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. విలన్ గా తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించిన నెపోలియన్ ఇక ఇప్పుడు విలన్ పాత్రలు చేయలేనని క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే చేస్తానని అన్నారు.

 

తెలుగు, తమిళ భాషల్లో నెపోలియన్ చాలా సినిమాలు చేశారు. కెరియర్ లో కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న నెపోలియన్ ఇక మీదట వరుస సినిమాలు చేస్తానని అంటున్నారు. విలన్ గా తన ముద్ర వేసిన నెపోలియన్ ఇక మీదట అలాంటి పాత్రలు చేయనండం విశేషం. విజయ్ సినిమాలు చేయనని చెప్పడంతో ఆ హీరో ఫ్యాన్స్ నెపోలియన్ మీద విమర్శలు చేస్తున్నారు. విజయ్ సినిమాల్లో నటించనని చెప్పి అజిత్ తో నటించాలని ఉందని చెప్పడంతో విజయ్ ఫ్యాన్స్ మరింత ఫైర్ అవుతున్నారు. మరి అసలు ఇంతకీ నెపోలియన్ ఉద్దేశ్యం ఏంటో తెలియాల్సి ఉంది.
  

మరింత సమాచారం తెలుసుకోండి: