చిరంజీవి.. బాలకృష్ణ.. వెంకటేశ్.. నాగార్జున లాంటి సీనియర్ హీరోయిన్స్ కు మన సీనియర్ హీరోయిన్స్ ఏ మాత్రం తీసిపోరు. పెద్ద హీరోలు 60ప్లస్ లోనూ హీరోలుగా మెప్పిస్తుంటే.. 35ప్లస్ ముద్దుగుమ్మలు ఇప్పటికింకా పదహారే అంటూ దూసుకుపోతున్నారు. కెరీర్ స్టార్ట్ చేసి 20ఏళ్లవుతున్నా ఇప్పటికీ మెప్పిస్తున్నారు.  

 

హీరోయిన్స్ కెరీర్ పదేళ్లు సాగితే ఎక్కువ అని చెబుతారు. రకుల్, శృతిహాసన్ ఓ ఐదేళ్లు ఊపేసి ఫేడౌట్ అయిపోయారు. దీక్ష సేథ్.. యామి గౌతమ్ లాంటి భామలు రెండు, మూడు సినిమాల తర్వాత కనిపించలేదు. అయితే మిలీనియం మొదట్లో కెరర్ స్టార్ట్ చేసిన నలుగురు హీరోయిన్స్ ఛాన్సులు అందుకుంటూనే ఉన్నారు. శ్రియ, నయన.. అనుష్క, త్రిష కెరీర్ స్టార్ట్ చేసి 15.. 20 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ ఫామ్ లోనే ఉన్నారు. 

 

నయనతార కెరీర్ స్టార్ట్ చేసి పదిహేడేళ్లయింది. పూజా హెగ్డే.. రష్మిక లాంటి క్రేజీ భామలున్నా.. సౌత్ టాప్ రెమ్యునరేషన్ ఇప్పటికీ నయనతారదే. తమిళంలో రజినీ, అజిత్, విజయ్ లాంటి స్టార్స్ కు తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, లాంటి సీనియర్స్ కు కూడా నయనతారే కావాలి. ఎప్పుడూ చేతిలో నాలుగు సినిమాలతో బిజీగా ఉంటోంది ఈ సీనియర్ హీరోయిన్. నయనతార కంటే వయసులో పెద్దదే అయినా.. చిన్నదిలా కనిపిస్తుంది త్రిష. ఈ అమ్మడు యాక్టింగ్ స్టార్ట్ చేసి 21ఏళ్లయింది. 1999లో వెండితెరకు పరిచయమైన ఈ బ్లాక్ బ్యూటీ తమిళ ఇండస్ట్రీని ఇప్పటికీ ఏలుతోంది. తెలుగుపై ఇంట్రెస్ట్ చూపించకపోయినా.. తమిళంలో మాత్రం యంగ్, సీనియర్ అనే తేడా లేకుండా.. అందరికీ త్రిషానే కావాలి. 

 

వయసు పెరుగుతున్నా.. పెళ్లి అయినా ఆఫర్స్ శ్రియను వరిస్తున్నాయి. 2001లో ఇష్టం మూవీతో ఇంట్రడ్యూస్ అయిన శ్రియ కెరీర్ కు 19ఏళ్లు. రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా నటించే అరుదైన ఛాన్స్ సొంతం చేసుకుంది శ్రియ. 

 

ఈ మధ్యకాలంలో బాలకృష్ణ సినిమా అంటే హీరోయిన్ గా ముందు శ్రియ పేరే వినిపిస్తోంది. గౌతమి పుత్ర శాతకర్ణి.. పైసా వసూల్ సినిమాల్లో బాలయ్యతో జత కట్టిన శ్రియ.. ఆర్ఆర్ఆర్ లో నటిస్తోంది. ఈ విషయాన్ని లాక్ డౌన్ లో టైమ్ లో లైవ్ లో బయట పెట్టేసింది. దృశ్యం హిందీ రీమేక్ లో అజయ్ దేవగణ్ తో జత కట్టిన శ్రియ ఆర్ఆర్ఆర్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అజయ్ దేవగణ్ తో కలిసి నటించనుందట. శ్రియ, త్రిష, నయనతో పోల్చుకుంటే.. అనుష్క వయసు ఎక్కువే. 38ఏళ్ల వయసులోనూ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది అనుష్క. వెయిట్ తగ్గకపోవడంతో.. బొమ్మాళీని స్టార్స్ పట్టించుకోవడం లేదు. లేదంటే మరిన్ని ఆఫర్స్ అందుకునేది. రిలీజ్ కు రెడీగా ఉన్న నిశ్శబ్దం కూడా.. యువి క్రియేషన్స్ లో మరో మూవీకి కమిట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

 

అందరిదీ ఒక దారైతే.. తమన్నాది మరో దారి. ఈ సీనియర్ హీరోయిన్స్ తో పోల్చుకుంటే.. తమన్నా వయసు తక్కువే. ఈ మధ్యనే 30లోకి అడుగుపెట్టింది. అయితే 15ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. 16ఏళ్లకే యాక్టింగ్ స్టార్ట్ చేసింది. తమన్నా డెబ్యూ మూవీ చాంద్ సే రోషన్ నెహ్రా 2005లో రిలీజైంది. 15ఏళ్లుగా కెరీర్ నడిపించడం మాటలు కాదు. అటు గ్లామర్ తో ఇటు పెర్ ఫార్మెన్స్ రోల్స్ తో ఆకట్టుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: