ప్రభాస్ అనుష్కల కలయికలో దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి రెండు భాగాల సినిమాలు కూడా ఒక దానిని మించేలా మరొకటి ఎంతో గొప్ప సక్సెస్ కొట్టడంతో పాటు వందల కోట్ల రూపాయల కలెక్షన్ ని ఆర్జించి తెలుగు సినిమా ఖ్యాతిఁని విశ్వ వ్యాప్తం చేసిన విషయం తెలిసిందే. బాహుబలి మొదటి భాగాన్ని మించేలా రెండవ భాగం రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్ ని కొల్లగొట్టి భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక స్థాయి కలెక్షన్ ని అందుకున్న సినిమాగా రెండవ స్థానంలో నిలిచింది. ఇక ఆ సినిమా తరువాత పలు భాషల్లో వచ్చిన అనేక భారీ బడ్జెట్ సినిమాలు దానిని అందుకోవాలని ఎంతో ప్రయత్నించినా అది మాత్రం సఫలం కాలేదు. 

IHG

ఇక ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో రాజమౌళి తీస్తున్న పేట్రియాటిక్ మూవీ ఆర్ఆర్ఆర్ మాత్రమే బాహుబలి 2 కలెక్షన్ ని అందుకోగలదని దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో గట్టిగా నమ్ముతున్నారు. అయితే బాహుబలి 2 ని మించేలా అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దంగల్ సినిమా రూ. 2000 కోట్ల పైచిలుకు కలెక్షన్ ని అందుకుని మన దేశంలోనే అత్యధిక కలెక్షన్ ని కొల్లగొట్టిన సినిమాగా ప్రధమ స్థానంలో నిలిచింది. ఒకరకంగా బాహుబలి 2, దంగల్ సినిమాల కలెక్షన్ ని ఆర్ఆర్ఆర్ అందుకోవడం అంటే అది అంత సులువు కాదని అంటున్నారు కొందరు. 

 

ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు ఒకప్పటివలె లేవని, అదీకాక బాహుబలి రెండు భాగాల తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయని, అంతటి అంచనాలు అందుకుని అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తి పరచి భారీ రేంజ్ లో ముందుకు దూసుకెళ్లడం అంటే మాములు విషయం కాదనేది వారి వాదన. అయితే ఈ వాదనను మరికొందరు ఖండిస్తున్నారు. మొదటి నుండి రాజమౌళి తీస్తున్న సినిమాల తీరుని బట్టి చూస్తే, ఆయన కేవలం కథ, కథనాలను నమ్మి మాత్రమే సినిమా తీస్తారనేది అర్ధం అవుతుందని, ఆ విధంగా ఎంతో అలోచించి గాని ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా మొదలెట్టి ఉండరని, తప్పకుండా భారత దేశంలో ఇప్పటివరకు ఉన్న అన్ని సినిమాల కలెక్షన్ ని మించేలా ఆర్ఆర్ఆర్ అత్యధిక రేంజ్ హిట్ తో పాటు కలెక్షన్ అందుకోవడం ఖాయం అని వారు చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో గత రికార్డులను అన్నిటిని అధిగమించి ఆర్ఆర్ఆర్ సినిమా ముందుకు దూసుకెళ్లడం అతి పెద్ద సవాలే అని అంటున్నారు సినీ విశ్లేషకులు....!! 


 

మరింత సమాచారం తెలుసుకోండి: