ఓటీటీ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ఇపుడు అతి పెద్ద సినిమా ధియెటర్ అయింది. అక్కడ సినిమాను రిలీజ్ చేసుకుని కాసుల పంట పండించుకోవాల్సిందే. ఇపుడు అంతకంటే గత్యంతరం లేదు. నిజానికి కరోనా వైరస్  వచ్చేసి ఎన్నో ట్రెడిషన్లకు వీడ్కోలు పలికేసింది. నిత్యం ప్రజలతో లింకప్ అయ్యే రాజకీయ నాయకులే ఇపుడు జాం యాప్ లు, వర్చువల్ సెమినార్లు. వీడియో సమావేశాలు అంటూ కొత్తగా అడుగులు వేస్తున్నారు.

IHG

ఈ నేపధ్యంలో అందరి కంటే గట్టి దెబ్బ సినిమాల వారికే పడుతోంది. ధియేటర్లు తెరచుకునే సీన్ లేదు. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేవరకూ మహమ్మారి పొంచి ఉండడం ఖాయం. ఒకవేళ లేదనుకున్నా ఆ భయం మాత్రం జనంలో ఉండి తీరుతుంది. అత్యవరసర పనులకు కానీ జనం బయటకు రావడంలేదు. సినిమా హాళ్లకు వచ్చి టికెట్ పెట్టి మరీ కరోనాను అంటించుకోవాలని ఈ టైమ్ లో ఎవరు  సరదా పడతారు. 

IHG

అందువల్ల ఇపుడు చూసుకుంటే ఓటీటీకి మించిన ఫ్లాట్ ఫారం లేదు. పైగా సినిమాలు కధలు అన్నవి ఎప్పటికపుడు కొత్తగా ఉంటాయి. ఆ ఫ్లావర్ పోతే అవి పాతబడిపోతాయి. అపుడు రిలీజ్ చేసినా థియేటర్లలో కూడా జనం చూడరు. వారి ఆసక్తిని చూసుకుని మరీ సినిమాను వదిలితేనే ఫలితం ఉంటుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్లో ఇప్పటికే బడా హీరోలు ఓటీటీ ఫ్లాట్ ఫారం ను యూజ్ చేసుకుంటున్నారు.

IHG

మిగిలిన కోలీవుడ్, మాలీవుడ్  కూడా ఇదే బాట పడుతున్నాయి. ఇపుడు టాలీవుడ్ మాత్రమే మిగిలింది. దాంతో ఓటీటీ ఫ్లాట్ ఫారం యజమానులు ముందుగా మిడిల్ రేంజి సినిమాలకు గురి పెడుతున్నారుట. అవి క్లిక్ అయితే పెద్ద సినిమాలు, హీరోల సినిమాలు ఆటోమేటిక్ గా తమ వద్దకే వస్తాయని చూస్తున్నారుట. ఆగస్ట్ నుంచి ఓటీటీ ద్వారానే తెలుగు కొత్త  సినిమాలు వస్తాయని అంటున్నారు. మరి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: