ఆమె పేరు శ్రధ్ధ శ్రీనాధ్. కన్నడ కస్తూరి. తెలుగులో ఆమె తొలి సినిమా జెర్సీ. నాచురల్ స్టార్ నాని పక్కన పెయిర్. ఆ  సినిమా ఫరవాలేదు అనిపించుకున్నా అందులో ఆమె వేసిన పిల్ల తల్లి పాత్ర మాత్రం పెద్దగా ఆఫర్లు తెచ్చిపెట్టలేదు. పైగా  ఆమెని మడికట్టుకుని కూర్చున్న వాటంగా జమ కట్టేశారు. ఇక ఆ తరువాత కూడా ఆమెకు తెలుగులో ఏమంత గొప్ప చాన్స్ రాలేదు. అయితే కరోనా వేళ, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా శ్రధ్ధ సినిమా ఒకటి ఓటీటీ ఫ్లాట్ ఫారం మీద రిలీజ్ అయి ఆమెకు మంచి మార్కులు తెచ్చిపెట్టింది.

IHG

క్రిష్ణ అండ్ హిజ్ లీల అన్న సినిమాలో శ్రధ్ధా శ్రీనాధ్ తన అందాలతో అల్లలాడించింది. అలాగే ఈ సినిమాలో బోల్డ్ టైప్ పాత్రతో ఆమె యూత్ కి కిర్రెక్కించింది. ఆమె లిప్ లాక్ సీన్లు, బెడ్ రూం సీన్లు ఇపుడు చర్చకు వస్తున్నాయి. అలాగే ఈ మూవీలో ఆమె సిగరెట్ కాల్చడం కూడా బోల్డ్ టైప్ కే హైలెట్.

IHG

దాంతో శ్రధ్ధ ఇమేజ్ కంప్లీట్ గా చేంజి అయింది. ఇక మీదట ఆమె అందాల ఆరబోతకు సైతం సై అంటుందన్న మెసేజ్ ఒకటి టాలీవుడ్ ఇండస్ట్రీకి పాస్ అయింది. అది చాలు తనకు వెల్లువలా చాన్సులు వస్తాయని శ్రధ్ధ అంచనా వేసుకుంటోంది. ఇక ఆమె ఇపుడు ఏమాత్రం తొందరపడడంలేదుట. అలాగని మడికట్టుకుని కూర్చోను అని చెబుతోంది. పాత్ర ఎంత మేరకు కోరితే అంత మేరకు పరువాలు ఒలకబోస్తానని కూడా చెబుతోంది. ఇది నిజంగా మూవీ మేకర్స్ కి ఒక వరమే అనుకోవాలి. అన్నీ ఉన్న శ్రధ్ధ లాంటి హీరోయిన్ తో బోల్డ్ టైప్ రోల్స్ చేయించుకోవడానికి మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు.

IHG

ఇదిలా ఉండగా శ్రధ్ధ మరో మూవీ విశాల్ తో నటించిన చక్ర కూడా ఓటీటీ ఫ్లాట్ ఫారం ద్వారా తొందరలో విడుదల కాబోతోంది. అది కూడా హిట్ అయితే ఈ అమ్మడు రేంజి ఏంటో కూడా తెలుస్తుంది. దాంతో బెట్టు చేసి మరీ తన ప్లేస్ ఏంటో చెప్పాలని  శ్రీనాధ్ రెడీగా ఉందిట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: