కరోనా విపత్తు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ తీసింది. తిరిగి సాధారణ స్థితికి ఇండస్ట్రీ ఎప్పుడు వస్తుందో కూడా తలలు పండిన ఏ ఒక్కరు అంచనా వేయలేకపోతున్నారు. వందల కార్మీకులు నమ్ముకొని పనిచేసే సినిమా ఇండస్ట్రీ, సినిమా తప్ప మరో వ్యాపారం తెలియని నిర్మాతలు, సినిమా తప్ప మరో ప్రపంచం తెలియని హీరోలు, దర్శకులకి  ప్రస్తుతం నడుస్తున్నది అత్యంత గడ్డు కాలమని చెప్పాలి. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు నిర్మాత ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు నిర్మిస్తుంటాడు. అలాంటి నిర్మాత పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారిపోయింది.

 

ఒక సినిమా నిర్మాణం జరుపుకొని వెండితెరమీద బొమ్మ పడాలంటే  సమిష్ఠ కృషి అయిన చివరకి ఆ సినిమాకి మాత్రం నిర్మాతే కర్త కర్మ క్రియ. కాని ఇప్పుడు ఆ నిర్మాత పరిస్థితే గందరగోళంగా మారింది. భారీ బడ్జెట్ తో ఎన్నో మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మించారు దిల్ రాజు. ప్రస్తుతం ఆయన నిర్మాతగా రెండు పెద్ద ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మిస్తున్న “వకీల్ సాబ్” కాగా మరొకటి నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబులు, నివేదా థామస్, అదిథిరావు హైదరీ హీరో హీరోయిన్స్ గా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వస్తున్న “వి” సినిమా. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి.

 

నాని వి సినిమా ఎప్పుడో పూర్తయింది. రిలీజ్ చేయడమే తరువాయి. అందుకే ఈ “వి” సినిమాకు పెద్ద ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ చేసేందుకు భారీ ఆఫర్ చేశారట. అయితే దిల్ రాజ్ ఆ ఆఫర్ ను నిర్మొహమాటంగా రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. అంతేకాదు నాని వి, వకీల్ సాబ్ సినిమాలను ఆలస్యం అయినా కూడా థియోటర్స్ లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు క్లారిటీ ఇచ్చారట. అయితే ఇందుకు కారణం దిల్ రాజు కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ కావడంతో రానున్న రోజుల్లో సినిమా రిలీజ్ విషయంలో థియోటర్స్ యాజమాన్యం తో సమస్యలు తలెత్తుతాయన్నది ఒక కారణం అని చెప్పుకుంటున్నారు. ఇక వకీల్ సాబ్ కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేసి థియోటర్స్ ఓపెన్ అయ్యాక రిలీజ్ కి సన్నాహాలు  చేయనున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: