టాలీవుడ్ లో మాస్ మహారాజ రవితేజ కి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ని ఆదర్శంగా తీసుకున్న రవితేజ ఎవరి సపోర్ట్ లేకుండా సహాయ దర్శకుడిగా చిత్ర పరిశ్రమలో ప్రయాణం మొదలు పెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇండస్ట్రీలో మెగాస్టార్ తర్వాత మళ్ళీ కష్టపడి సొంతగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వాళ్ళలో రవితేజ ఒకడు. ఇండస్ట్రీకి కొత్తగా హీరో అవ్వాలని వచ్చే వాళ్ళు మెగాస్టార్, రవితేజ లనే  ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు పోషించిన రవితేజ నీకోసం సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్ సినిమాల తర్వాత రవితేజ ఇండస్ట్రీలో స్టార్ గా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని మార్కెట్ ని సంపాదించుకున్నాడు.

 

ఇక గత కొన్నేళ్ళుగా రవితేజ ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. మధ్యలో సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రవితేజ తో రాజా ది గ్రేట్ తీసి ఒక మంచి కమర్షియల్ హిట్ ఇచ్చాడు. దాంతో మళ్ళీ రవితేజ మళ్ళీ సక్సస్ ట్రాక్ ఎక్కాడనుకుంటే కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఎన్నో నమ్మకాలు పెట్టుకొని చేసిన నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా...సినిమాలు కనీసం యావరేజ్ గా కూడా నిలబడలేకపోయాయి. 

 

అయినా మాస్ రాజా ఊపు మామూలుగా లేదు. ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని తో క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రవితేజ గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న క్రాక్ హ్యాట్రిక్ సినిమా అవుతుందన్న నమ్మకంతో ఈ ఇద్దరు ఉన్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ తో ఒక సినిమా చేయబోతున్నాడు రవితేజ. ఇస్మార్ట్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించే అవకాశాలున్నాయట. ఇక తాజాగా మరో సినిమాకి కమిటయ్యాడు రవితేజ. ఈ సినిమా మెగాస్టార్ నటించిన చంటబ్బాయ్ సినిమాకి ఇన్స్పిరేషన్ అని తెలుస్తుంది. నేను లోకల్ ఫేం నక్కిన త్రినాథ్ రావు ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: