తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరి స్టార్ హీరో, హీరోయిన్  సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. వారి సినిమాలు వస్తే టీవీలకు అతుక్కుపోతారు.. అలాంటి స్టార్ లు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు..అలనాటి తారల నుంచి ఇప్పటికీ రాణిస్తున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.. సినిమాలలోని కీలక పాత్రను పోషిస్తూ హవాను కొనసాగిస్తూ వస్తుండగా మరి కొందరు మాత్రం లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు.. ఆ స్టార్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.. 

IHG


రమ్యకృష్ణ.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.. ఎన్నో సినిమాలలో నటించిన ఈమె ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు.. హీరోయిన్ గా ఆమె చేసిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆమె అందం , అభినయం, పాత్రలో జీవించేలా ఆమె నటన ఇప్పటికీ అలానే కొనసాగుతుంది.. అమ్మోరు పాత్రల నుంచి నిన్న వచ్చిన శివగామి పాత్రల వరకు ఆమె నటనలో మార్పు లేదు అందుకే ఇప్పుడు ఆమెతో మంచి పాత్రను చేయించాలని చాలా మంది దర్శక నిర్మాతలు క్యూ కడుతుండటం అతిశయోక్తి కాదు.. 

IHG


ప్రేమ.. ఈ పేరు ఇప్పుడు వినపడక పోవచ్చు కానీ అప్పుడు మాత్రం తెగ మారు మోగింది.. నాగ దేవత.. దేవి, దేవి అభయం ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో ఈమె నటించింది.. లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు ప్రేమ పేరు ఫేమస్.. అలాంటి ప్రేమ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ వ్యవహారాలను చూసుకుంటూ వస్తుంది..

IHG


 రోజా.. రోజా పేరుకు పరిచయం అక్కర్లేదు.. అంతగా ఆమె ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు.. బాలకృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించడమే కాదు.. ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.. ఇప్పుడు సినిమాలలో తక్కువగా కనిపిస్తూ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.. ఇక ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.. 

 

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోయిన్లు వరుసలోకి వస్తారు.. ప్రస్తుతం అనుష్క, నయనతార పేర్లు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: