తెలుగు ప్రేక్షకులు సినిమాపై చూపే ఆదరణ ప్రత్యేకం. దీంతో ఔత్సాహికులు సినిమాల్లో రాణించేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతోమంది కొత్తవారు హీరోలుగా తెరంగేట్రం చేశారు. అలాంటి యువ హీరోల్లో ‘కార్తికుయ గుమ్మకొండ’ కూడా ఉన్నాడు. నటనలో పర్ఫెక్షన్, బాడీ లాంగ్వేజ్, డ్యాన్సుల్లో ఈజ్.. ఇలా సినిమా హీరోకు కావాల్సిన అన్ని అంశాలు కార్తికేయలో ఉన్నాయని చెప్పాలి. సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినిమాలపై ఇంట్రెస్ట్ తో తన ప్రయత్నాలు చేసి హీరో అయ్యాడు కార్తికేయ.

IHG'Valimai'

 

ప్రేమతో మీ కార్తీక్ సినిమా ద్వారా 2017లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ.. రెండో సినిమాగా చేసిన ఆర్ఎక్స్ 100 కార్తికేయను మీడియం రేంజ్ స్టార్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో కార్తికేయకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. దర్శక నిర్మాతలు కార్తికేయపై నమ్మకం ఉంచారు. ఆ సినిమా ఇచ్చిన హిట్ తో వరుసగా హిప్పి, గుణ 369, గ్యాంగ్ లీడర్, 90ఎమ్ ఎల్.. సినిమాలు చేశాడు. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ లో నెగటివ్ రోల్ చేశాడు. నటుడిగా ఎదిగే క్రమంలో వచ్చిన మంచి పాత్రలు వదులుకోకూడదని నిరూపించాడు.

IHG

 

చిరంజీవి, రజినీకాంత్, మోహన్ బాబు.. ఆదర్శంగా ఆ విలన్ పాత్ర చేసి మెప్పించాడు. ప్రస్తుతం యూత్ లో మంచి ఫాలోయింగ్ సాధించిన కార్తికేయ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. కార్తికేయ టాలెంట్ ను గుర్తించిన అల్లు అరవింద్ తమ గీతా ఆర్ట్స్ లో ‘చావు కబురు చల్లగా’ అనే సినిమా ప్రారంభించారు. తమిళ్ లో వలమాయ్ సినిమాలో కూడా అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. తనలోని టాలెంట్ ను తెరపై అంతే పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసిన కార్తికేయకు మంచి భవిష్యత్ ఉందనే చెప్పాలి.

IHG's next with the makers of <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RX 100' target='_blank' title='rx 100-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rx 100</a> ...

మరింత సమాచారం తెలుసుకోండి: