వాస్తవానికి తన తండ్రి మంచి పేరున్న ప్రఖ్యాత దర్శకుడైనప్పటికీ కూడా యాక్టింగ్ నేర్చుకుని హీరోగా అల్లరి సినిమాతో టాలీవుడ్ రంగప్రవేశం చేసాడు అల్లరి నరేష్. తొలి సినిమాతోనే తనలోనే కామెడీ టాలెంట్ ని బయటపెట్టిన నరేష్, ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడు. ఇక అక్కడి నుండి మెల్లగా ఆయనకు అవకాశాలు పెరిగాయి. అలానే వాటిని మంచి సక్సెస్ లుగా మలుచుకుని ముందుకు సాగడంలో నరేష్ బాగా సఫలం అయ్యారు. మొదట్లో మంచి విజయాలతో ముందుకు సాగిన నరేష్, ఇటీవల రోజుల్లో మాత్రం ఆ స్పీడ్ ని అందుకోలేకపోతున్నారు. వాస్తవానికి ఎప్పటికప్పుడు నరేష్ నుండి వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నప్పటికీ, అవి ఆశించిన రేంజ్ హిట్స్ మాత్రం అందుకోవడం లేదు. 

IHG

అయితే మొదటి నుండి కూడా తన హాస్యపు జల్లులతో తెలుగు ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూ సాగుతున్న నరేష్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ప్రేక్షకాభిమానులున్నారు. మధ్యలో తండ్రి ఇవివి దర్శకత్వంలో పలు సినిమాలు చేసిన నరేష్, ఆయన మరణం తరువాత కొంత కృంగిపోయారు. కాగా కొన్నాళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాలో నరేష్ పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. ఇక ప్రస్తుతం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పివి గిరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బంగారు బుల్లోడు సినిమా టీజర్ తో పాటు ఆయన పూర్తి స్థాయి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా నటిస్తున్న నాంది సినిమా టీజర్ కూడా నరేష్ బర్త్ డే సందర్భంగా ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. 

 

కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ అనంతరం, ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాయని, అయితే పూర్తి స్థాయిలో థియేటర్స్ తెరిచిన తరువాత తాను నటిస్తున్న ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని, అలానే వాటితో మంచి సక్సెస్ లు అందుకుని మళ్ళి మంచి ఫామ్ లోకి వస్తాననే ఆశాభావాన్ని ఇటీవల నరేష్ వ్యక్తం చేస్తూ మాట్లాడినట్లు తెలుస్తోంది...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: