ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న స్థాయి నటుడి నుండి స్టార్ హీరో స్థాయికి తన టాలెంట్ తో ఎదిగిన విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కెరీర్ బిగినింగ్ లో 2011లో డైరెక్టర్ రవిబాబు తీసిన నువ్విలా సినిమాలో చిన్న క్యారెక్టర్ లో నటించిన విజయ్, ఆ తరువాత అక్కడక్కడా సినిమాలో చిన్న రోల్స్ లో నటించాడు. అయితే అదే సమయంలో నాని హీరోగా స్వప్న సినిమా బ్యానర్ పై వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో హీరో ఫ్రెండ్ రోల్ లో నటించి ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్నాడు. 

IHG

ఆ తరువాత 2016లో తన స్నేహితుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారాడు. కాగా ఆకట్టుకునే కథ, కథనాలతో మంచి ఫ్రెష్ ఫీల్ తో తెరకెక్కిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుని, హీరోగా నటించిన తొలి సినిమాతోనే విజయ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అనంతరం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన బోల్డ్ కంటెంట్ మూవీ అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన విజయ్ కు, ఆ సినిమా అతి పెద్ద విజయాన్ని అందుకుని, ఆయనకు ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. దాని తరువాత యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం సినిమా కూడా సూపర్ సూపర్ హిట్ కొట్టి, ఒక్కసారిగా విజయ్ కెరీర్ గ్రాఫ్ ని ఎంతో ఎత్తుకి తీసుకెళ్లడం జరిగింది. 

 

ప్రస్తుతం విజయ్ కు అటు లేడీస్ తో పాటు ఇటు యువతలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక ఆ విధంగా క్రింది స్థాయి నుండి వచ్చిన హీరోల్లో మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న విజయ్, తన టాలెంట్ తో వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. అయితే ఇటీవల మాత్రం కెరీర్ పరంగా సక్సెస్ ల కోసం కొంత తడపడుతున్నాడు. అయినప్పటికీ ప్రస్తుతం డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా మూవీ ఫైటర్ తో తప్పకుండా సూపర్ హిట్ కొట్టి మళ్ళి మంచి ఫామ్ లోకి వచ్చి తీరుతాను అంటున్న విజయ్ కు ఆ సినిమా ద్వారా ఎంతమేర సక్సెస్ ని ఇస్తుందో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే...!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: