చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి ఎంటర్ అయినా తరుణ్.. మంచి మంచి సినిమాలు తీసాడు. ఇంకా తల్లి రోజారమణి సపోర్ట్ కూడా ఉండడంతో తరుణ్ కు టాలీవుడ్ పరిశ్రమ మరింత దగ్గరైంది. అయితే చిన్నతనంలోనే అందరిని ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకొని బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అవార్డులు అందుకున్నాడు. 

 

IHG's comeback?

 

ఇంకా అలాంటి హీరో పెద్దయ్యాక  ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై విజయ భాస్కర్ దర్శకత్వంలో నువ్వే కావాలి సినిమాలో హీరోగా నటించి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కూడా అప్పట్లో మంచి సూపర్ హిట్ సాధించింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ సాధించడంతో ఇతను సూపర్ స్టార్ అవుతాడు అని అందరూ అనుకున్నారు. 

 

IHG

 

కానీ ఫస్ట్ సినిమాకు వచ్చిన సక్సెస్ ఆయన కెరీర్ లో ఏ సినిమాకు రాలేదు. ఆ తరువాత తరుణ్ హీరోగా తెరకెక్కిన నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు వంటి సినిమాలు తప్పించి చాలా వరకు మిగతా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. ఈ సినిమాలు అయినా ఒకలా హిట్ అయ్యాయి. 

 

IHG

 

ఇంకా ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్ని కూడా అట్టర్ ప్లాప్ అయ్యాయి. మంచి కథను ఎంచుకోకపోవడం.. ఇంకా ఒక హీరోయిన్ తో అఫైర్ ఉందని పుకార్లు రావడం పెద్ద సంచలనమే సృష్టించింది. ప్లాప్ లు రావడం వల్ల అతని కెరీర్ సక్సెస్ అవ్వలేదు. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సక్సెస్ అవ్వలేకపోయాడు తరుణ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: