మంజులా ఘట్టమనేని సూపర్ కృష్ణ కూతురుగా మహేష్ అక్కగా ఈమెను ఎరగని వారుండరు. వాస్తవానికి మహేష్ కంటే ఈమె ముందుగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్ రేంజ్ కి చేరుకోవలసిన వ్యక్తి. అయితే పరిస్థితులు అనుకూలించక పోవడంతో తనకు వచ్చిన హీరోయిన్ అవకాశాలు వదులుకుని ఆతరువాత కొన్ని సినిమాలలో నటించి ఆపై నిర్మాతగా దర్శకురాలిగా ఈమె చేయని ప్రయత్నం అంటూ లేదు.


ప్రస్తుతం ఈ ప్రయోగాలకు దూరంగా మంజుల ‘సెల్ఫ్ డెవలప్ మెంట్’ పేరుతో ప్రారంభిస్తున్న వెబ్ ఛానల్ వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. తన వెబ్ ఛానల్ ను ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజుల కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.


గతంలో తాను హీరోయిన్ కాలేకపోయానని బాధపడుతూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన సందర్భాన్ని వివరిస్తూ ఆబాధ నుండి బయటపడటానికి తాను యోగ ఉపాసన క్రియలకు సంబంధించిన ఒక లాంగ్ టర్మ్ కోర్స్ చేసానని ఈ కరోస్ లో తాను ఏకంగా 10 వేల గంటలు ధ్యానం చేసిన విషయాన్ని ఆమె బయటపెట్టింది. ఈ కోర్స్ చేసిన తరువాత తనకు హీరోయిన్ కాలేదు అన్న బాధ తన మనసు నుండి పెరిగిపోవడమే కాకుండా నిజమైన లైఫ్ అంటే ఏమిటో తనకు తెలిసివచ్చేలా తాను నేర్చుకున్న ఆధ్యాత్మిక కోర్స్ లు తనకు కనువిప్పు చేసింది అని అంటోంది.


‘వెల్ నెస్’ పేరుతో హెల్త్ మైండ్ స్పిరిట్ ఈ మూడు అంశాలకు సంబంధించి సమన్వయము ఉంటే జీవితం ఎంత సజావుగా ఉంటుందో తెలియచేయడానికి తాను ఒక వెబ్ ఛానల్స్ ప్రారంభిస్తున్న విషయాన్ని తెలియచేసింది. మంచి ఆలోచనలు ఉంటేనే మంచి జీవితం ఉంటుంది అని చెపుతూ తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుపతి వెళ్ళి గంటల కొద్ది క్యూలో నుంచుని దర్శనం చేసుకునే మనషులు మనం పిలవకుండానే ప్రతిరోజు ఉదయాన్నే మన ఇంటిలోకి వచ్చి శక్తివంతమైన కిరణాలను ప్రసరించే సూర్య భగవానుడు ని పట్టించుకుని ఆ సూర్యకిరణాల మధ్య మెడిటేషన్ యోగ బ్రీతింగ్ ఎక్స్ సైజ్ లు చేస్తే మనిషికి ఎలాంటి అనారోగ్యం ఉండదు అని చెపుతూ మహేష్ సాధించని రికార్డ్ ను మంజుల సాధించింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: