మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. అల్లు అర్జున్ బాగా కష్టపడి కెరియర్ సెట్ చేసుకున్నాడు. తానో నిర్మాత కొడుకుని అనే గర్వం లేకుండా బన్ని తన టాలెంట్ చూపిస్తున్నడు. టాలీవుడ్ స్టార్ హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఇక అల్లు శిరీష్ మాత్రం గౌరవం సినిమాతో ఎంట్రీ ఇవ్వగా మారుతి డైఅక్షన్ లో కొత్తజంట సినిమా చేశాడు. పరశురాం డైరక్షన్ లో శ్రీరస్తు శుభమస్తు సినిమాతో కెరియర్ లో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్నాడు ఈ అల్లు హీరో.

 

అల్లు అరవింద్ తలచుకుంటే స్టార్ హీరోతో అల్లు శిరీష్ సినిమా.. పకడ్బందీ కథతో.. భారీ బడ్జెట్ తో తీసేయొచ్చు కాని సొంత టాలెంట్ తో పాపులారిటీ తెచ్చుకోవాలని అనుకుంటున్న అల్లు శిరీష్ యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. శ్రీరస్తు శుభమస్తు సినిమా హిట్ తర్వాత ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమా డైరక్టర్ వి.ఐ.ఆనద్ తో ఒక్క క్షణం సినిమా చేశాడు. ఆ సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఏబిసిడి అంటూ మళయాళ రీమేక్ చేయగా అదికూడా నిరాశపరచింది.

 

ప్రస్తుతం కొత్త సినిమా కథా చర్చల్లో ఉన్న అల్లు శిరీష్ ఇక మీదట కథల విషయంలో మరింత జాగ్రత్త వహిస్తాడని తెలుస్తుంది. వెనకాల అల్లు అరవింద్ ఉన్నాడు కాబట్టి సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆఫర్స్ వస్తాయి. కాని అల్లు శిరీష్ మాత్రం తన టాలెంట్ చూపించడానికి బాగా ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ హీరోకి ఎప్పుడు లక్ కలిసి వస్తుందో చూడాలి. అల్లు శిరీష్ కూడా హిట్ ట్రాక్ లోకి వస్తే అల్లు అరవింద్ కొద్దిగా రిలాక్స్ అవుతాడు. ఇప్పటికే అల్లు బాబి నిర్మాతగా సెటిల్ అయ్యే ఆలోచనలో ఉండగా అల్లు శిరీష్ కూడా తన నిర్మాతగా తన టేస్ట్ చూపించబోతున్నాడని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: