తరుణ్... ఈ తరానికి పెద్దగా అతని గురించి పరిచయం లేదు గాని అతని సినిమాల గురించి అతని నటన గురించి మాత్రం కిందటి తరానికి కాస్త పరిచయం ఉంది. 90 లలో పుట్టిన వారికి అతని నటన గురించి అతని సినిమాల గురించి మంచి అవగాహన ఉంది అనే చెప్పాలి. స్టార్ హీరో అవుతాడు అని అతని గురించి చాలా మంది ఆశగా ఎదురు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అతని నటన చూసి అతనికి ఇక తిరుగు లేదు అనుకున్నారు. కాని అతను మాత్రం ఆ వచ్చిన పేరు ని ఏ మాత్రం కూడా నిలబెట్టుకోలేదు. అతని తల్లికి చాలా మంచి పేరు ఉంది. 

 

ఆ పేరు తోనే అతను స్టార్ హీరో అయ్యే విధంగా అడుగు పెట్టాడు. కాని అతని కెరీర్ లో ఏ మాత్రం కూడా జాగ్రత్తలు తీసుకోలేదు. అతని సినిమాలు అతని నటన అన్నీ కూడా యువతకు చాలా బాగా నచ్చినా సరే అతను మాత్రం కథల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం తో కెరీర్ బాగా ఇబ్బంది పడింది. ఇతర విషయాల మీద శ్రద్ధ పెట్టడమే అతని కెరీర్ ని బాగా ఇబ్బంది పెట్టిన అంశంగా చెప్తూ ఉంటారు. అవసరం లేని విషయాల్లో అతను ఎక్కువగా అప్పట్లో తల దూర్చిన సందర్భాలు ఉన్నాయి అని అంటారు. 

 

అందుకే అతను చాలా మందికి దూరం అయ్యాడు అని కూడా  అంటూ ఉంటారు. ఇప్పుడు అతను రెండు సినిమాల్లో ఏదో పాత్రలో చేస్తున్నాడు అని అన్నారు గాని అది నిజం కాదు అని తెలిసింది. అయితే అతను స్టార్ ఇమేజ్ ని నిలబెట్టుకునే విషయంలో కొన్ని కొన్ని తప్పులు చేసాడు అని అందుకే అతని కెరీర్ అలా ఆగిపోయింది అని చెప్తూ ఉంటారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: