విజయ్ దేరవరకొండ... ఈ పేరు వింటే చాలా మందికి ఇప్పుడు యువతలో ఒక పూనకం అనేది వస్తుంది. అతని నటన అర్జున్ రెడ్డి సినిమాలో గాని పెళ్లి చూపులు సినిమాలో గాని గీత గోవిందం సినిమాలో గాని ప్రతీ దానిలో కూడా చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. అతని నటన కు అతని ప్రవర్తనకు చాలా మంది ఫాన్స్ ఉన్నారు. యువత ఏది కావాలి అనుకుంటుందో అది ఇవ్వడం అతని లో ఉన్న ప్రత్యేకత అని చాలా మంది అంటారు. అతను కూడా చాలా వరకు యువత విషయంలో అలాగే ఉంటాడు. యువత అతని నుంచి ఏది కోరుకుందో అది ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. 

 

అతని అర్జున్ రెడ్డి సినిమా చూస్తే ఈ విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఆ సినిమాలో బాబు నటన కు చాలా మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమాలో అతను కొన్ని కొన్ని సన్నివేశాల్లో జీవించాడు అని సినిమా చూసిన ఎవరు అయినా సరే మరో మాట లేకుండా చెప్పే మాట. అగ్ర హీరో ఇమేజ్ ని అతను చాలా ఫాస్ట్ గా తెచ్చుకున్నాడు. అయితే కథల విషయంలో మాత్రం అతను వేలు పెట్టడం అనేది చాలా మందికి కాస్త చికాకుగా అనిపించిది అని అంటారు. అందుకే స్టార్ దర్శకులు అతని మీద కూడా కాస్త ఆగ్రహంగా ఉన్నారు అని అంటారు. 

 

అతను తనకు అంతా తెలుసు అనే భ్రమలో ఉంటాడు అని అది అతని కెరీర్ ని బాగా  ఇబ్బంది పెట్టింది అని అంటూ ఉంటారు. ఇప్పుడు అతను పూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అది లాక్ డౌన్ లో ఆగిపోయింది. ఆ తర్వాత తమిళ సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: