టాలీవుడ్ లో చాలా ఫాస్ట్ గా స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న హీరో వరుణ్ సందేశ్. అతని నటనకు చాలా మంది మొదటి సినిమాతోనే ఫాన్స్ అయిపోయారు. యూత్ ని అన్ని విధాలుగా కూడా అతను ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి. కథల విషయంలో అతను కెరీర్ మొదట్లో తీసుకున్న ప్రతీ జాగ్రత్త కూడా అతనికి యువత లో మంచి స్టార్ హీరో ఇమేజ్ ని తీసుకుని వచ్చింది. అమెరికాలో ఉండిపోయిన అతని ప్రతిభను ఒక దర్శకుడు ఇక్కడికి తీసుకొచ్చి అతనికి కొత్త బంగారు లోకాన్ని చూపించాడు. కాని అతను మాత్రం కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు అని చాలా మంది అంటారు. 

 

కెరీర్ విషయంలో  కనీస జాగ్రత్తలు తీసుకునే సమయంలో అతను ఏ మాత్రం లెక్కలేని విధంగా వ్యవహరించాడు అని అందుకే అతని సినిమాలు ఆకట్టుకోలేదు అని చాలా మంది అంటారు. అతని సినిమాల్లో ఉండే కథ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నా సరే అతని కెరీర్ నేడు ఇంకోలా ఉండేది. ఇక ఇతర విషయాల మీద అతను చేసిన ఫోకస్  అతని కెరీర్ ని బాగా ఇబ్బంది పెట్టింది అనే చెప్పాలి. కెరీర్ లో అతనికి మంచి కథలు వచ్చినా సరే ఇతర విషయాల మీద పెట్టిన శ్రద్ధ మంచి కథల విషయంలో పెట్టలేదు కాబట్టి అతని కెరీర్ బాగా ఇబ్బంది పడింది అని చాలా మంది అంటూ ఉంటారు. 

 

అతను అసలు ఇప్పుడు ఏ సినిమా చేయడం లేదు. అతనికి అవకాశం ఇచ్చే దర్శక నిర్మాతలు కూడా ఎవరూ లేరు. అతని సినిమాలు కూడా ఇప్పుడు వచ్చిన చూసే ప్రేక్షకులు లేరు. అతని సినిమాలు చూడటానికి అదోలా ఉంటాయి అని చాలా మంది కామెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే అర్ధం చేసుకోవచ్చు అతని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: