టాలీవుడ్ లో స్టార్ హీరో  కావడానికి బ్యాక్ గ్రౌండ్ ఉంటే చాలు... నటన వచ్చినా లేకపోయినా సరే స్టార్ హీరో కావడం అనేది పెద్ద కష్టం కాదు అనే సంగతి తెలిసిందే. స్టార్ హీరోలుగా ఇప్పుడు ఉన్న చాలా మంది లో కొందరు... తండ్రి లేదా బాబాయి లేదా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ని వాడుకుని పైకి వచ్చిన వారు కనపడతారు. నటన విషయంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం వారిని బాగా ఇబ్బంది పెడుతుంది. అయితే ఒకరు ఇద్దరు మాత్రం వారికి ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా సరే కథల విషయం నుంచి నటన వరకు డాన్స్ వరకు అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు అనే చెప్పాలి. 

 

అందులో ప్రధానంగా చెప్పుకునే హీరో... రామ్ చరణ్. అతను స్టార్ హీరో కావడానికి తండ్రి ఇమేజ్ సరిపోతుంది. కాని అతను ఎక్కడా కూడా ఆ ఇమేజ్ తో మాత్రమే సినిమాలు చెయ్యాలి అని భావించిన సందర్భం అనేది ఎప్పుడు కూడా లేదు అనే చెప్పాలి. తండ్రికి ఏ రేంజ్ లో ఇమేజ్ ఉన్నా సరే కథల విషయంలో రామ్ చరణ్ ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. అతను ఆరెంజ్ సినిమా విషయంలో  పడిన దెబ్బ ను దృష్టి లో ఉంచుకుని చాలా జాగ్రత్తగా సినిమాలు చేసాడు అనే సంగతి అందరికి తెలుసు. 

 

అతను ఎంచుకున్న రంగస్థలం సినిమా కథ చాలా బాగుంటుంది. ఆ సినిమాలో అతని నటన అతని పాత్ర అన్నీ కూడా ప్రేక్షకులకు చాలా ఆగా నచ్చాయి అనే చెప్పాలి. ఆ సినిమా చాలా మంచి విజయం సాధించడమే కాదు రామ్ చరణ్ కి మంచి పేరు తెచ్చింది. అతని సినిమాలు అనగానే ఒక రేంజ్ లో క్రేజ్ అనేది తెచ్చింది ఆ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: