2001లో రిలీజ్ అయిన సూపర్‌ హిట్‌ యూత్‌ ఫుల్ కామెడీ ఎంటర్‌ టైనర్‌ 6 టీన్స్‌. ఎలాంటి స్టార్ ఇమేజ్‌ లేకపోయినా ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. జీ నాగేశ్వర రెడ్డి దర్శకత్వం లో జే శ్రీనివాస్‌ రెడ్డి నిర్మాత గా తెరకెక్కిన ఈ సినిమా తో రోహిత్‌, రుతిక హీరో హీరోయిన్లు గా పరిచయం అయ్యారు. తొలి సినిమా నే ఘన విజయం సాధించటంతో హీరో రోహిత్ కెరీర్‌ ఊపందుకుంది.

 

6 టీన్‌ ఊపు తో తరువాత నేను సీతా మా లక్ష్మీ, రత్నం,  గాళ్‌ ఫ్రెండ్‌ , అనగనగా ఓ కుర్రాడు లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా లేవీ హిట్ కాకపోవటం తో రోహిత్‌ కెరీర్‌ గాడి తప్పింది. దీంతో సపోర్టింగ్‌ రోల్స్‌ కు మారాడు రోహిత్. మెగాస్టార్  చిరంజీవి హీరో గా తెరకెక్కిన శంకర్‌ దాదా ఎమ్‌ బీ బీ ఎస్‌ సినిమా లో ఏకంగా చిరంజీవి కాలర్‌ పట్టుకునే రేంజ్‌ క్యారెక్టర్‌ లో కనిపించినా రోహిత్ కెరీర్‌ కు బ్రేక్‌ రాలేదు.

 

దర్శకత్వ శాఖ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ తరువాత పూర్తిగా ఇండస్ట్రీ కి దూరమయ్యాడు. కథ ఎంపిక, పాత్రల ఎంపిక లో చేసిన పొరపాట్లు రోహిత్‌ కెరీర్‌ ను మరింత దెబ్బతీశాయి. దీంతో కెరీర్‌ లో లాంగ్ గ్యాప్ వచ్చింది. చివరగా ఎన్‌ ఆర్‌ ఐ, హాఫ్‌ బాయిల్‌ లాంటి సినిమాల్లో నటించాడు ఈ హీరో. వీటిలో హాఫ్ బాయిల్‌ 2013 లో రిలీజ్‌ అయ్యింది. అయితే ఈ సినిమా కూడా రొహిత్‌ కెరీర్‌ కు బూస్ట్‌ ఇవ్వలేకపోవటంతో రోహిత్ కెరీర్‌కు పూర్తిగా తెర పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: