టాలీవుడ్ లో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి కి మంచి స్టార్ ఇమేజ్ లేదు కాని  పెదనాన్న చిరంజీవి కి మాత్రం మంచి ఇమేజ్ ఉంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో. హాలీవుడ్ హీరో మాదిరి ఉంటాడు అని చాలా మంది అతనిని చూసి కామెంట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అతనికి ఆ ఇమేజ్ బాగానే అమ్మాయిల్లో ఫాలోయింగ్ తీసుకుని వచ్చింది గాని అతను మాత్రం ముందుకు వెళ్ళే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. బాబాయి, పెదనాన్న ఇద్దరూ స్టార్ హీరోలు అయినా... 

 

మెగా ఫ్యామిలీ నుంచి స్టార్ నిర్మాత ఉన్నా సరే అతను  మాత్రం చాలా వరకు  జాగ్రత్తగా సినిమాలు చేస్తూ ఉంటాడు. ఏ మాత్రం కంగారు లేకుండా మంచి కథలను ఎంపిక చేసుకుని సినిమాలను అతను ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. అతని కెరీర్ లో వచ్చిన ఏ సినిమా చూసినా సరే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ప్రతీ సినిమా విషయంలో కూడా అతను అందరి సలహాలను తీసుకుంటాడు. స్టార్ దర్శక నిర్మాతలతో సినిమాలు చేసే అవకాశం ఉన్నా సరే ఎక్కడా కూడా తొందరపడకుండా చేస్తూ ఉంటాడు అనే సంగతి తెలిసిందే. 

 

బాబాయి ఇమేజ్ ని  గాని పెదనాన్న ఇమేజ్ ని గాని వాడుకున్న సందర్భం అనేది ఎప్పుడు కూడా లేదు అనే అంటారు. అతని తండ్రి కి ఎలాగూ ఇమేజ్ లేదు. అయినా సరే తానే సొంతగా తనను తాను నిర్మించుకుని సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు అతను చేస్తున్న సినిమాలకు సంబంధించి కథలు కాస్త భిన్నంగానే ఉంటున్నాయి. రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల అతను నటించిన గద్దల కొండ గణేష్ సినిమా అతనికి మంచి ఇమేజ్ తెచ్చింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: