రానా... టాలీవుడ్ లో యూత్ లో మంచి హీరో. అతని మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా సినిమాల విషయంలో అతను తీసుకున్న చాలా వరకు జాగ్రత్తలు అతనిని చాలా మంచి హీరో ని చాలా ఫాస్ట్ గా చేసాయి అని చాలా మంది అంటూ ఉంటారు. అతని కథల ఎంపిక సినిమాలు చేసే విధానం అతని నటన అన్నీ కూడా అతనిని స్టార్ ని చేసాయి. స్టార్ ఇమేజ్ ఉన్నా సరే చిన్న చిన్న దర్శకులకు అవకాశాలు ఇవ్వడం ఆ సినిమాలను అతను పైకి తీసుకొచ్చే విధానం అన్నీ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. 

 

తండ్రి స్టార్  నిర్మాత అయినా సరే ఏ రోజు కూడా తండ్రి ఇమేజ్ ని అతను వాడుకున్న సందర్భం అనేది లేదు అనే అంటారు చాలా మంది. అవును తండ్రి ఇమేజ్ ని అతను ఏ సందర్భంలో కూడా వాడుకోలేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అగ్ర హీరో అయ్యే అవకాశాలు ఉన్నా సరే అతను మాత్రం కథల విషయంలో ప్రతీ చిన్న జాగ్రత్త కూడా తీసుకుని సినిమాలను ఎంచుకుని చేసాడు. ఇప్పుడు చేసే సినిమాలు అయిన గతం లో చేసే సినిమాలు అయినా సరే అన్నీ కూడా ప్రేక్షకులకు కాస్త కొత్తగా అందించే ప్రయత్నం అతను చేసాడు అనే చెప్పాలి. 

 

ఇప్పుడు అతను రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒక సినిమాలో అతను కాస్త భిన్నంగా కనపడుతున్నాడు. అరణ్య అనే సినిమాలో అతని పాత్ర కాస్త కంగారు పెట్టే విధంగా ఉంటుంది అని టాలీవుడ్ లో టాక్ మరి. ఆ పాత్ర ఏ విధంగా ఉంటుంది ఏంటీ అనేది చూడాలి. ఇప్పటికే వచ్చిన టీజర్ కాస్త కంగారు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: