టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ప్రస్తుత కరోనా సమస్యలు వల్ల ఈ 2020 పై పూర్తిగా ఆశలు వదిలేసుకుంది. రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులతో ఈ దసరా కు కూడ ధియేటర్లు తెరుచుకుంటాయి అన్న నమ్మకం ఎవరికీ కలగడంలేదు. దీనితో ఇండస్ట్రీకి మళ్ళీ కళ వచ్చేఏడాది సంక్రాంతి నుంచే ఉంటుందని కలలు కంటూ వచ్చే ఏడాది సంక్రాంతికి ఏసినిమాలు విడుదల అవుతాయి.


సంక్రాంతి రేస్ విజేత ఎవరు అంటూ అప్పుడే చర్చలు మొదలైపోయాయి. టాప్ హీరోల సినిమాలకు సంబంధించి చాలభాగం షూటింగ్ పూర్తి అయి ఇక కేవలం పట్టుపట్టి ఒక నెలరోజులు షూటింగ్ చేస్తే చాలు పూర్తి అయిపోయే సినిమాల లిస్టులో పవన్ ‘వకీల్ సాబ్’ వెంకటేష్ ‘నారప్ప’ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ మొదటి వరసలో ఉన్నాయి.


ఇప్పటికే దిల్ రాజ్ ‘వకీల్ సాబ్’ కు సంబంధించి ఇప్పటి వరకు షూట్ చేసిన సినిమాకు సంబంధించి నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తిచేస్తూ ‘వకీల్ సాబ్’ మిగిలిన షూటింగ్ ను అక్టోబర్ లో పూర్తిచేసి ఎట్టి పరిస్థితులలోను ‘వకీల్ సాబ్’ ను సంక్రాంతి రేసులో నిలబెట్టి భారీ కలక్షన్స్ కొల్లగొట్టాలని ఇప్పటి నుంచే ప్లాన్స్ రచిస్తున్నాడు. ఇప్పుడు ఈ వ్యూహాలు బయటకు లీక్ కావడంతో ‘వకీల్ సాబ్’ కు సంక్రాంతి ఆధిపత్యం పూర్తిగా రాకుండా నిర్మాణం చివరి దశలో ఉన్న ‘నారప్ప’ ‘వైల్డ్ డాగ్’ మూవీల షూటింగ్ లను కూడ అక్టోబర్ లో పూర్తిచేసి ఈ రెండు సినిమాలను కూడ సంక్రాంతి బరిలోకి దింపాలని ఈ మూవీ నిర్మాతలు ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


అయితే ఈ వ్యూహాలు విజయవంతం అవ్వాలి అంటే కనీసం అక్టోబర్ కు అయినా కరోనా కు భయటపడకుండా సెట్స్ పైకి రావడానికి పవన్ వెంకటేష్ నాగార్జున లు అంగీకరించాలి. దీనితో అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ పవన్ వెంకటేష్ నాగార్జునుల మధ్యనే ఉంటుందని ప్రాధమీక అంచనాలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: