తేజస్వి మాదివాడ వెండితెర ప్రేక్షకులతో పాటు బుల్లితెర ప్రేక్షకులకి కూడా పరిచయమే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు, హార్ట్ అటాక్, మళ్లీ మళ్ళీ ఇది రానిరోజు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన తేజస్వి, రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆమెకి సరైన గుర్తింపు రాలేదు. అయితే వెండితెర మీద అంతగా అవకాశాలు రాకపోయినా బిగ్ బాస్ లో కనిపించి బాగా పాపులర్ అయింది.

 

అయితే గత కొన్ని రోజులుగా తేజస్వి మాదివాడ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా తేజస్వి సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ని ఒలకబోస్తూ ఫోటోలని షేర్ చేస్తూ వస్తుంది. దీంతో సోషల్ మీడియాలో అభిమానులని బాగా పెంచుకుంది. స్కిన్ షో చేస్తూ గ్లామర్ షో చేయడానికి కూడా రెడీ అంటున్నట్లుగా ఉంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఆమె రెగ్యులర్ గా టచ్ లో ఉండడానికి కారణం ఆమె నటిస్తున్న కమిట్మెంట్ చిత్రమే అంటున్నారు. 

 


లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందుతున్న కమిట్మెంట్ చిత్రంలో తేజస్వి హీరోయిన్ గా కనిపించనుంది. అందులో ఉన్న నలుగురు హీరోయిన్లలో తేజస్వి కూడా ఒకరు. అయితే సినిమా రంగంలో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకి ఎదురయ్యే అనుభవాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజస్వి చాలా బోల్డ్ గా కనిపించనుందట. అందువల్లే ఈ సినిమాకి ప్రమోషన్ కోసమే సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ వస్తుందని అంటున్నారు. అయితే తేజస్వి ప్లాన్ బాగానే ఉన్నప్పటికీ సినిమాలో కంటెంట్ ఉంటేనే సినిమా చూస్తున్నారన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: