టాలీవుడ్ లో చిన్న హీరో పైకి రావాలి అంటే అతనికి చాలా కష్టంగా ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. అతను పైకి రావాలి అంటే చాలా వరకు పరిస్థితులు కలిసి రావాల్సి ఉంటుంది. అతనికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందాల్సిన అవసరం కూడా ఉంటుంది. స్టార్ల నుంచి అతనిని పైకి తీసుకురావాలి. ముందు అతనిలో ఉన్న ప్రతిభ ని అతను బయట పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అది లేకుండా అతను పైకి రావడం అనేది అసలు ఏ మాత్రం కూడా సాధ్యం అయ్యే పని కాదు. అయితే వరుస ఫ్లాప్ సినిమాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నిలబడాలి. 

 

అలా నిలబడి స్టార్ హీరో గా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు నితిన్ అనే సంగతి తెలిసిందే. అతనికి వచ్చిన ఫ్లాప్ లు అతను పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అసలు అతను సినిమాలకు పనికొచ్చే అవకాశం లేదు అని చాలా మంది  అతని టార్గెట్ గా  ఎన్నో విమర్శలు చేసారు. అతని సినిమా ఏది వచ్చినా సరే ఒక రోజు లేదా రెండు రోజులు లేదా  ఒక పది రోజులు ఆడటమే గాని అవి హిట్ అయిన సందర్భం అనేది చాలా తక్కువగా ఉండేది అని చెప్పాలి. అయినా సరే అతను చాలా వరకు ఎదురు చూసాడు. 

 

ఒక మంచి సినిమా కోసం అతను ఎదురు చూసిన విధానం చాలా మందికి నచ్చుతుంది. చాలా వరకు అతను దర్శక నిర్మాతలతో తనకు ఉన్న పరిచయాలను అతని సినిమాలకు వాడుకునే ప్రయత్నం చేసి ఫ్లాప్ సినిమాలు వచ్చినా సరే ఏ మాత్రం కూడా కంగారు లేకుండా సినిమాలు చేసి స్టార్ హీరో గా నిలబడ్డాడు. అతను ఏ దశ లో కూడా భయపడిన సందర్భం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: