టాలీవుడ్ లో నానీ కి ఉన్న ఇమేజ్ గురించి అందరికి తెలిసిందే. ఒక సహాయక దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టి ఆ తర్వాత అతను స్టార్ హీరో అయిన విధానం అన్నీ కూడా చాలా వరకు తెలుగు ప్రేక్షకులకు అతని లో నచ్చే లక్షణాలు గా చెప్పవచ్చు. తనకు ఎంత స్టార్ ఇమేజ్ తక్కువ కాలంలో వచ్చినా సరే నానీ  కష్టపడిన విధానం చాలా మందిని ఆకట్టుకుంటూ ఉంటుంది. స్టార్ హీరో ఇమేజ్ ని చాలా  ఫాస్ట్ గా తెచ్చుకున్నాడు. దీనికి ప్రధాన కారణం అతనికి బాపు  దర్శకత్వంలో పని చేసిన అనుభవం అని చాలా మంది అంటారు. 

 

అవును బాపు నుంచి అతను నేర్చుకున్న కొన్ని లక్షణాలు అతని కి చాలా బాగా ఉపయోగపడ్డాయి అని చెప్తూ ఉంటారు. బాపు సలహాలతో నానీ పైకి వచ్చాడు అని చాలా మంది అంటారు. కథల ఎంపిక నుంచి సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు గాని నటన గాని అన్నీ కూడా బాపు నుంచి అతను చాలా వరకు నేర్చుకున్నాడు అని అవే అతనికి చాలా బాగా ప్లస్ అయ్యాయి అని టాలీవుడ్ లో అంటారు. అందుకే స్టార్ దర్శక నిర్మాతల నుంచి చిన్న చిన్న నిర్మాతల వరకు కూడా నానీ తో సినిమా చేయడానికి ముందుకు వస్తు ఉంటారు. 

 

నానీ కూడా చాలా జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుని సినిమాలను చేస్తూ ఉంటాడు ఏ మాత్రం హడావుడి లేకుండా చాలా వరకు జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేయడం అతని స్టైల్ అని అంటారు అతని సినిమాలు చూసిన ఎవరు అయినా సరే. ఇప్పుడు అతను ఒక సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే  ఏడాది రానుంది. దీని తర్వాత తమిళం లో ఒక ప్రాజెక్ట్ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: