మెగా బ్రదర్ నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ముకుంద సినిమా లో మొట్టమొదటిగా హీరోగా నటించిన వరుణ్ తేజ్ కి నటన పరంగా మంచి మార్కులే సంపాదించాడు. ఈ చిత్రంలో అతని సరసన పూజా హెగ్డే నటించి అందరి మనసులను చూరగొన్నది. వెండితెరపై వీరిద్దరూ చేసిన రొమాన్స్ ప్రేక్షకులను బాగా మెప్పించింది. తదనంతరం రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన కంచె సినిమా లో ధూపాటి హరిబాబు  పాత్రలో నటించి తన నటనా చాతుర్యాన్ని చాటాడు.


నిజానికి పదేళ్ల వయసులోనే తన తండ్రి నాగబాబు చిత్రమైన హ్యాండ్సప్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు వరుణ్ తేజ్. 2017 వ సంవత్సరం లో విడుదలైన లోఫర్, మిస్టర్ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. కానీ అదే సంవత్సరంలో విడుదలైన ఫిదా సినిమా కమర్షియల్ గా భారీ హిట్ అయ్యింది. పల్లెటూరి రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి భానుమతి క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ చిత్రంతోనే వరుణ్ తేజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అని చెప్పుకోవచ్చు.


2018లో రాశి ఖన్నా సరసన తొలిప్రేమ సినిమాలో నటించి మళ్లీ ప్రేక్షకులను బాగా మెప్పించాడు వరుణ్ తేజ్. ఆ తర్వాత f2 సినిమాలో తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. గద్దల కొండ గణేష్ సినిమాలో తన విలక్షణమైన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. మెగా కుటుంబానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అల్లు శిరీష్, అక్కినేని అఖిల్ వంటి హీరోలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయారు కానీ వరుణ్ తేజ్ మాత్రం కేవలం తన నటనా చాతుర్యంతో స్టార్ హీరో క్రేజ్ ని తనకంటూ ప్రత్యేకంగా సంపాదించుకున్నాడు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: