యువ హీరోల్లో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. సగానికి పైగా షూటింగ్ పూర్తైన ఈ సినిమా ఆఫ్టర్ కరోనా లాక్ డౌన్ త్వరలో షూటింగ్ కు వెళ్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత దేవరకొండ విజయ్ చేసే సినిమాపై ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా తన యంగ్ టీం తో విజయ్ దేవరకొండ ఏదో సీక్రెట్ మిషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

 

విజయ్ దేవరకొండ తన సోషల్ బ్లాగ్ లో పెట్టిన పిక్స్ చూసి.. తన టీం తో విజయ్ డీప్ డిస్కషన్స్ లో ఉన్నాడని తెలుస్తుంది. హీరోగానే కాదు నిర్మాతగా కూడా ఒకటి రెండు సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ సంథింగ్ స్పెషల్ ప్లాన్ చేస్తున్నాడని మాత్రం తెలుస్తుంది. అదేంటి అనేది మాత్రం త్వరలో తెలుస్తుంది. కొత్త టీం తో కొత్త ఆలోచనలను ఎంకరేజ్ చేసే విజయ్ త్వరలో ఏదో ఒక సర్ ప్రైజ్ ఇస్తాడని అంటున్నారు.

 

పూరితో చేస్తున్న ఫైటర్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. పూరి కూడా ఈ కథను బాలీవుడ్ ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా రాసుకున్నారట. సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. హిందిలో ఈ సినిమాను కరణ్ జోహార్ రిలీజ్ చేయబోతున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాను సౌత్ అన్నిభాషల్లో రిలీజ్ చేసిన విజయ్ ఫైటర్ తో బాలీవుడ్ లో తన లక్ టెస్ట్ చేసుకోబోతున్నాడు. ఒకవేళ ఫైటర్ అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే తప్పకుండా విజయ్ కూడా నేషనల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది. తను తెలుగులో చేసిన అర్జున్ రెడ్డి సినిమాను చూసే విజయ్ ను బీ టౌన్ ఆడియెన్స్ తో పాటుగా సెలబ్రిటీస్ కూడా ఇష్టపడుతున్నారు. అలాంటిది డైరెక్ట్ గా బాలీవుడ్ లో హిట్టు కొడితే మాత్రం ఇక అతనికి తిరుగు ఉండదని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: